నేహా సోలంకి
నేహా సోలంకి | |
|---|---|
| జననం | 1998 December 25 హల్ద్వాని, ఉత్తరాఖండ్, భారతదేశం |
| ఇతర పేర్లు | నేనూ |
| చదువు | డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ |
| పాఠశాల/కళాశాలలు | ఆమ్రపాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, హల్ద్వానీ, ఉత్తరాఖండ్, భారతదేశం |
| బంధువులు | మనీష్ సోలంకి |
నేహా సోలంకి (జననం 1998 డిసెంబరు 25) భారతీయ మోడల్, సినీనటి. సహాయ దర్శకురాలు కూడా అయిన ఆమె మాయావి మాలింగ్ (2018), 90ఎంఎల్ (2019),[1] ఏక్ బట్టే దో (2020) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.
ప్రారంభ జీవితం
[మార్చు]నేహా సోలంకి 1998 డిసెంబరు 25న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జన్మించింది. ఆమె స్థానిక ఆమ్రపాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్ లో డిప్లొమా పూర్తిచేసింది.
కెరీర్
[మార్చు]నేహా సోలంకి సేఠ్ జీ (2017)తో టెలివిజన్ రంగంలో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె నటిగా కెరీర్ ఎంచుకునే ముందు కొన్ని ప్రాజెక్టులకు సహాయ దర్శకురాలిగా వ్యవహరించింది. 2019 లో 90ఎంఎల్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత, ఆమె భాగ్ సాలే, గేమ్ ఆన్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. భాగ్ సాలేలో ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి సరసన నటించింది. ఈ చిత్రానికి ప్రణీత్ సాయి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ‘కూత రాంప్..’ అనే పాట యువతను అమితంగా ఆకట్టుకుంది.[2]
2023లో భారతీయ హిందీ భాషా రొమాంటిక్ డ్రామా టెలివిజన్ సిరీస్ టిట్లీలో అవినాష్ మిశ్రాతో కలిసి ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఇది స్టార్‌ప్లస్, డిస్నీ+ హాట్‌స్టార్ లలో ప్రసారమయింది.[3][4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]టెలివిజన్
[మార్చు]- సేఠ్ జీ (2017)
- మాయావి మాలింగ్ (2018)
- టిట్లీ (2023)
సినిమా
[మార్చు]- 90ఎంఎల్ (2019)
- ఛలో ప్రేమిద్దాం (2021)
- గూడుపుఠాణి (2021)
- భాగ్ సాలే (2023)
- ప్రేమకథ (2023)
- గేమ్ ఆన్ (2024)
మూలాలు
[మార్చు]- ↑ "Wayback Machine". web.archive.org. 2023-02-23. Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Bhaag Saale: యూత్‌ను ఆకట్టుకుంటున్న 'భాగ్ సాలే'లోని పాట." EENADU. Retrieved 2025-12-03.
- ↑ "Neha Solanki shares experience of interacting with flower vendors for her role in 'Titli'". ThePrint. 4 June 2023.
- ↑ "Avinash Mishra: It Was Very Challenging to Understand My Titli Character | Exclusive". 7 June 2023.