ఎదురీత (1977 సినిమా)
Appearance
ఎదురీత (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
చిత్రానువాదం | వి.మధుసూదనరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | శ్రీశ్రీ, కొసరాజు, వేటూరి సుందరరామ్మూర్తి |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | వి.యస్.ఆర్.స్వామి |
కళ | తోట తరణి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు, కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | ఇంద్ర మూవీస్ |
భాష | తెలుగు |
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. బెంగాలీ కథానాయకుడు ఉత్తమ్ కుమార్ నటించిన విజయవంతమైన హిందీ చిత్రం అమానుష్ ఆధారంగా తెలుగులో ఎన్. టి. ఆర్ హీరోగా నిర్మించబడింది. ఎక్కువభాగం చిత్రం ఔట్ డోర్ లో తూర్పు గోదావరి లంక గ్రామాల్లో చిత్రీకరింపబడింది.[1]
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- వాణిశ్రీ
- జయసుధ - గంగ
- జె.వి.రమణమూర్తి
- సాక్షి రంగారావు - తోక
- కొంగర జగ్గయ్య - పోలీస్ అధికారి
- తాడేపల్లి కాంతారావు - ధర్మయ్య
- కైకాల సత్యనారాయణ - ప్రెసిడెంట్ భూషయ్య
- బి.పద్మనాభం
- బాలకృష్ణ
- మాడా
- శాఖమూరి రామచంద్రరావు.
పాటలు
[మార్చు]- ఎదురీతకు అంతం లేదా (హిందీలో టైటిల్ సాంగ్ బాణీలో), రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమంతి మొగ్గ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- బాలరాజు బంగారు సామీ, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- ఈ రాధ చివరికి ఏమైనా ఆ గాథ నీవేలే ,రచన: వేటూరి సుందర రామమూర్తి- పి.సుశీల
- తాగితే ఉయ్యాలా ఉూగితే జంపాల,రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గొదావరి వరదల్లో రాదారీ పడవల్లె , రచన: వేటూరి, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Edhureetha (1977)". Indiancine.ma. Retrieved 2023-05-31.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.