కోటగిరి వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
(కోటగిరి వెంకటేశ్వర రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కోటగిరి వెంకటేశ్వరరావు
వృత్తిఎడిటర్
మతంహిందూమతం
జీవిత భాగస్వామిసుజాత
పిల్లలు2 అమ్మాయిలు

కోటగిరి వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్. వీరి సోదరుడు కోటగిరి గోపాలరావు కూడా ఎడిటర్ గా పనిచేశారు.

జీవిత సంగ్రహం[మార్చు]

కోటగిరి వెంకటేశ్వరరావు గారి పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.[1] వీరికి ముగ్గురు అన్నయ్యలు మరియు ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నాకోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రిగారు మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరి, జమిందారు గారి స్టుడియోలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.

చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట ఒక నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు గారు అప్పుడు కె.రాఘవేంద్రరావు గారి అడవి రాముడు (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.

తర్వాత రాఘవేంద్రరావు గారి సినిమాలతో పాటు, బి.గోపాల్, భారతీరాజా, ఎన్టీరామారావు మొదలైన ఎందరో సినీ దర్శకుల మరియు నిర్మాతల చిత్రాలకు పనిచేశారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా స్థిరపడక ముందు ఇతని దగ్గర ఒక సంవత్సర కాలం ఎడిటింగ్ నేర్చుకున్నారు.

వీరు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు. ఈ సంస్థ కోసం విరాళాలు పోగుచేసి స్వంత ఆఫీసును నిర్మించారు.

వీరు సుజాతను పెళ్ళిచేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.

పురస్కారాలు[మార్చు]

నంది అవార్డులు[మార్చు]

చిత్ర సమాహారం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఇది అన్నయ్య నేర్పిన విద్య, ఈనాడు ఆదివారం 20 నవంబర్ 2011 లో కోటగిరి వెంకటేశ్వరరావు పరిచయం.

బయటి లింకులు[మార్చు]