Jump to content

మస్కా

వికీపీడియా నుండి
మస్కా
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
తారాగణం రామ్,
హన్సికా,
షీలా,
ముకేష్ రిషి,
ఆలీ,
వేణుమాధవ్,
బ్రహ్మానందం,
గుండు హనుమంతరావు,
వంశీ పైడితల్లి
నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 14 జనవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మస్కా 2009 లో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం . బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, హన్సిక మోత్వానీ, షీలా, సునీల్ నటించారు . ఇది 550 థియేటర్లలో 300 ప్రింట్లతో 2009 జనవరి 14 న విడుదలైంది. దీనిని 2012 లో వాలెంటైన్స్ డే రోజున ఒన్నోరోకోమ్ భలోబాషాగా బెంగాలీ (బంగ్లాదేశ్) లో రీమేక్ చేశారు. 2016 లో మళ్ళీ వాలెంటైన్స్ డే రోజున బెంగాలీ (ఇండియా-బంగ్లాదేశ్ జాయింట్ వెంచర్) లో హీరో 420గా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని హిందీలోకి ఫూల్ ఔర్ కాంటే అని అనువదించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సుమారుగా ఆడింది

క్రిష్ ( రామ్ ) తన అన్నా (నరేష్) వదిన (ఝాన్సీ) లతో కలిసి నివసించే జాలీ కుర్రాడు. అతను మంజు ( షీలా ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె సింహాచలం ( ముఖేష్ రిషి ) కుమార్తె. ఆమెను వివాహం చేసుకోవడం ద్వారా ధనవంతులు కావడమే క్రిష్ యొక్క ఏకైక ఉద్దేశం తప్ప ఆమె పట్ల అతనికి ప్రేమ ఉండదు. మంజు తనను ప్రేమించడం కోసం తాను మీనాక్షి/మీను ( హన్సిక మోత్వానీ ) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కథ అల్లుతాడు. అతను మీనును కూడా కలుస్తాడు, ఆమెను నిజంగానే ఇష్టపడటం ప్రారంభిస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇదిలావుండగా, ఢిల్లీలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సింహాచలం, షిండే ( ప్రదీప్ రావత్ ) ఒకరిపై ఒకరు పోటీ పడతారు. షిండే దుర్మార్గుడు. సింహాచలం వ్యక్తిగత జీవితంలో లోపాలను కనుగొనటానికి ప్రయత్నిస్తాడు, తద్వారా పార్టీ హైకమాండ్ ముందు అతని బండారం బయటపెట్టవచ్చు. తద్వారా పార్టీ టికెట్ పొందడానికి అతని మార్గం సుగమమౌతుంది. సింహాచలానికి మరో భార్య ( సీత ), ఒక కుమార్తె హైదరాబాద్‌లో ఉందని తెలుస్తుంది. వాళ్లను వెతకటానికి తన మనుష్యులను పంపుతాడు. దురదృష్టవశాత్తు, సింహాచలం మంజు, క్రిష్ ల పెళ్ళి నిశ్చయిస్తాడు. కాని క్రిష్ మీనును ప్రేమిస్తూంటాడు. మంజుకు అది తెలిసి, మీనుపై తుపాకీ గురిపెడుతుంది గానీ, క్రిష్ ను ఆమెకే వదిలి వేస్తుంది. మీను సింహాచలం అనధికారిక కుమార్తె అని, తనకు సోదరి అని వెల్లడిస్తుంది. సింహాచలం, క్రిష్, షిండేలు వస్తారు. మీను, మంజు తమ తండ్రిని అన్నీ మర్చిపోయి సంతోషంగా జీవించమని అడుగుతారు. అతను షిండేకు ఎన్నికను వదులుకుంటాడు. క్రిష్ అప్పుడు మీనును వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తాడు.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

2008 డిసెంబరు 25 రాత్రి రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో మస్కా పాటలను విడుదల చేసారు. దాసరి ఆడియో సిడిని లాంచ్ చేసి రామానాయుడికి మొదటి యూనిట్ ఇచ్చారు. డి సురేష్ బాబు ఆడియోకాసెట్‌ను ప్రారంభించి, మొదటి యూనిట్‌ను సినిమా ప్రధాన పాత్రధారులకు ఇచ్చాడు.[1] అన్ని పాటల రచయిత కందికొండ

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "హరే హరే రామా"  సూరజ్ జగన్ 4:25
2. "గుండె గోదారిలా"  జుబీన్ గార్గ్, కౌసల్య 5:11
3. "కల్లోకి దిల్లోకి"  చక్రి 4:17
4. "కలగన్నానా కలగన్నానా"  చక్రి, కౌసల్య 5:31
5. "అ వైపున్నా ఈ వైపున్నా"  హరిహరన్, సాధనా సర్గం 4:12
6. "బాగదాదు గజదొంగై వస్తా"  రవివర్మ, సునిధి చౌహాన్ 4:27
28:03

బాక్సాఫీసు

[మార్చు]

ఈ చిత్రం తొలి రోజున రూ .2.25 కోట్లు, మొదటి వారంలో రూ .10 కోట్లు వసూలు చేసింది.[2] ఆ సమయంలో అతిపెద్ద ఓపెనింగ్స్, రామ్ కెరీర్లో అతిపెద్ద ఓపెనింగ్స్ రాబట్టింది. అతన్ని పై కక్ష్య లోకి తీసుకెళ్ళింది.

మూలాలు

[మార్చు]
  1. "Maska music launch". idlebrain.com. Retrieved 25 December 2008.
  2. "'Maska' - 100 days collections in just one week - Andhravilas.com -Telugu Cinema, Telugu Movies, India News & World News, Bollywood, Songs:". Andhravilas.com. Archived from the original on 2012-07-21. Retrieved 2012-08-04.
"https://te.wikipedia.org/w/index.php?title=మస్కా&oldid=3979959" నుండి వెలికితీశారు