షీలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షీలా(Sheela)
జననంఆగస్టు 2
ఇతర పేర్లుమాయ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1996–2011
తల్లిదండ్రులుమమత (గృహిణి), ధనంజయన్ (బ్యాంక్ ఉద్యోగి)

షీలా దక్షిణ భారత చలనచిత్ర నటి. బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన షీలా, నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

జననం[మార్చు]

షీలా ఆగస్టు 2న ధనంజయన్, మమత దంపతులకు చెన్నైలో జన్మించింది.

సినిమా రంగం[మార్చు]

బాలనటిగా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన షీలా, మొదటిసారిగా పూం కాట్రుతిరుంబుమా అనే చిత్రంలో నదియాకి కూతురుగా నటించింది.[1] మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన డుండుండుం చిత్రంలో కడా బాలనటిగా నటించింది. బాలనటిగా దాదాపు 20 సినిమాల వరకు నటించింది.[2] 2006లో నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన షీలా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1996 పూవే ఉనక్కగ మీనా తమిళం
1998 గోల్ మాల్ ఐశ్వర్య కోడలు తమిళం
1999 మాయ జయసూర్య తమిళం
2001 నంద చిత్ర తమిళం
దీన ప్రియా తమిళం
డుం డుం డుం తమిళం
2006 ఇలవట్టం లక్ష్మీ తమిళం
సీతాకోక చిలుక తెలుగు
2007 వీరస్వామి సెంథిమిజా తమిళం
రాజు భాయ్ అంజలి తెలుగు
చీనా తనా 001 ప్రియా తమిళం
హలో ప్రేమిస్తారా నందిని తెలుగు
కన్నా అన్నపూరణీ రఘునాథన్ తమిళం
2008 వేద వేద తమిళం
పరుగు మీనాక్షి నీలకంఠం తెలుగు
మాయాబజార్ మాయ మలయాళం
2009 మస్కా మంజు సింహాచలం తెలుగు
ప్రేమ్ కహానీ[3] సంధ్య కన్నడ
2010 అదుర్స్ నందు తెలుగు
తంతోన్ని హెలెన్ మలయాళం
మేకప్ మాన్ సూర్య మలయాళం
2011 పరమ వీర చక్ర షీలా తెలుగు

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "షీలా , Sheela". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 2 June 2017.
  2. మూవీస్ రెడిఫ్. "Telugu films gave me name and fame". movies.rediff.com. Retrieved 2 June 2017.
  3. తెలుగు వెబ్ దునియా. "టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!". www.telugu.webdunia.com. Retrieved 2 June 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=షీలా&oldid=3462205" నుండి వెలికితీశారు