షీలా శ్రీ ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షీలా శ్రీ ప్రకాష్
షీలా శ్రీ ప్రకాష్
జననం
షీలా శ్రీ ప్రకాష్

(1955-07-06)1955 జూలై 6
భోపాల్, భారతదేశం
విద్యాసంస్థఅన్నా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
వృత్తిఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్.
బోర్డు సభ్యులుచెన్నై స్మార్ట్ సిటీ లిమిటెడ్.
శిల్పా ఫౌండేషన్
నిర్మనా ఇన్వెస్ట్‌మెంట్స్
శిల్పా ఆర్కిటెక్ట్స్
పిల్లలుభార్గవ్ శ్రీ ప్రకాష్ (కొడుకు)
పవిత్ర శ్రీ ప్రకాష్ (కుమార్తె)
గురు దండాయుధ పాణి పిళ్లై, గురు చిట్టి బాబు (సంగీతకారుడు) లతో 1968తో కుమారి షీలా

షీలా శ్రీ ప్రకాష్ ( జననం: జూలై 6, 1955 ) భారతీయ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్. భారతదేశంలో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించిన మొదటి మహిళ.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈమె 1955, జూలై 6 న జి.కె.ఎస్. పాథీ, ఎస్. తంగమ్మ దంపతులకు భోపాల్ లో జన్మించింది. ఈమె తన చిన్నతనం నుంచే శాస్త్రీయ భారతీయ నృత్యం, సంగీతం, కళలలో శిక్షణ పొందింది. ఈమె నాలుగు సంవత్సరాల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. 1961 లో తన అరంగ్రేట ప్రదర్శనను చూసిన పద్మ భూషణ్ పురస్కార గ్రహీత ధన్వంతి రామారావు ఈమెను బాల మేధావి ( చైల్డ్ ప్రాడిజీ ) అని పిలిచారు. ఈమె భరతనాట్యం, కూచిపుడి నర్తకిగానే కాకుండా, వీణ లాంటి సంగీత వాయిద్యం కూడా వాయిస్తుంది. ఈమె దాదాపు రెండు దశాబ్దాల కాలంలో భరతనాట్యం, కూచిపుడి నృత్యకారిణిగా ప్రదర్శనలు ఇచ్చింది. వీళ్ళ కుటుంబం శాస్త్రీయ కళలలో శ్రీ దండయుధ పాణి పిళ్ళై చేత భరతనాట్యంలో శిక్షణ పొందటానికి చెన్నైకి వెళ్లారు. ఈమెకు భరతనాట్యం, కూచిపుడి, వీణ, క్లాసికల్ ఇండియన్ మ్యూజిక్, పెయింటింగ్, శిల్పకళలను అభ్యసించింది.

విద్యాభ్యాసం[మార్చు]

ఈమె చెన్నైలోని రోసరీ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదివారు. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ డిగ్రీని పూర్తిచేశారు. ఈమె1973 లో అన్నా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ నుండి బాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్‌ను పూర్తిచేశారు. ఈమె హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సదస్సుకు హాజరయ్యారు.

ఆర్కిటెక్చర్[మార్చు]

ఈమె భారతదేశంలో పేరున్న వాస్తుశిల్పులలో ఒకరిగా, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వాస్తుశిల్పులలో ఒకరిగా ఉన్నారు. ఈమె 1200 కి పైగా నిర్మాణ ప్రాజెక్టులను రూపకల్పన చేసి పూర్తి చేసింది. ఇందులో చాలా వరకు స్థానిక కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా నమూనాలు ఉంటాయి. ఈమె 1987 లో ప్రపంచ బ్యాంకు ఆహ్వానం మేరకు రూపొందించిన సామాజిక-ఆర్ధికంగా వెనుకబడినవారికి తక్కువ-ధర రెసిప్రొకల్ హౌస్, ఇంధన సమర్థవంతమైన వాణిజ్య భవనాలు, కస్టమ్ బంగ్లాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక సౌకర్యాలు, ఆర్ట్ మ్యూజియంలు, స్పోర్ట్స్ స్టేడియాలు, విద్యా కేంద్రాలు, ప్రజా మౌలిక సదుపాయాలు, లగ్జరీ హోటళ్ళు వంటి నమూనాలను ప్రదర్శించారు. ఈమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యురాలు. ఈమె న్యూ చెన్నైలోని మహీంద్రా వరల్డ్ సిటీ, చోలమండల్ ఆర్టిస్ట్స్ విలేజ్‌లోని మద్రాస్ ఆర్ట్ హౌస్, చెన్నైలోని కూచిపుడి ఆర్ట్ అకాడమీ, పరానూర్ రైల్వే స్టేషన్, ప్రపంచ బ్యాంకు నిధులతో పట్టణ గృహనిర్మాణ అభివృద్ధి కార్యక్రమంలో ఈమె నిర్మాణ నమూనాలను చూడవచ్చు. ఈమె 1993 లో చెన్నైలో రీసైకిల్ పదార్థాలతో ఒక ఇంటిని రూపొందించింది. ఈ నిర్మాణాన్ని 2003 లో తమిళనాడు రాష్ట్రం తప్పనిసరి చేసింది. భారతదేశంలో మంచినీటి వనరుల క్షీణత సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా భారతదేశం అంతటా ఒక బ్లూప్రింట్గా ఈ నిర్మాణం పేరు తెచ్చుకుంది.[1]

ప్రపంచ ఆర్థిక ఫోరం గ్లోబల్ అజెండా కౌన్సిల్[మార్చు]

ఈమె 2011 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఎజెండా కౌన్సిల్ ఆన్ డిజైన్ ఇన్నోవేషన్‌లో పనిచేసిన మొదటి భారతీయ వాస్తుశిల్పిగా, ఇన్నోవేషన్‌లో అంతర్జాతీయ నిపుణుల 16 మంది సభ్యుల బృందంలో ఒకరిగా ఉన్నారు. ఈమె ఫోరమ్‌లో స్థిరమైన రూపకల్పన చుట్టూ ఉన్న పారామితులు, కొలమానాలను వివరించే "రెసిప్రొకల్ డిజైన్ ఇండెక్స్" ను అభివృద్ధి చేసింది.[2]

పురస్కారాలు[మార్చు]

  • కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్స్ (BAM) సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
  • 2017 లో అయాన్ మిన్కు విశ్వవిద్యాలయం నుండి బెనె మెరెంటి పురస్కారం
  • 2015 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నుండి గౌరవనీయ ఆర్కిటెక్ట్ పురస్కారం.
  • ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 100 మంది వాస్తుశిల్పులలో చోటు: ఇల్ గియోర్నేల్ డెల్'ఆర్కిటెట్టురా డేటా ఆధారంగా.[3]

మూలాలు[మార్చు]

  1. Rina Chandran (11 January 2020). "Forget mansions, modest homes needed amid land pressures, Indian architect says". Reuters.
  2. Sheila Sri Prakash | World Economic Forum – Sheila Sri Prakash. Weforum.org.
  3. "Asia's Largest Celebration of Women-led Development". WADe Surfaces Reporter. 11 January 2020.[permanent dead link]