కౌసల్య కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌసల్య కృష్ణమూర్తి
Kousalya Krishnamurthy Movie Poster.jpg
కౌసల్య కృష్ణమూర్తి సినిమా పోస్టర్
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
నిర్మాతకె.ఎ. వల్లభ
కె. ఎస్. రామారావు సమర్పణ
రచనచౌదరి హనుమాన్ (మాటలు)
స్క్రీన్ ప్లేభీమినేని శ్రీనివాసరావు
కథఅరుణ్‌రాజా కామరాజ్
నటులుఐశ్వర్య రాజేష్
రాజేంద్ర ప్రసాద్
కార్తీక్ రాజు
శివ కార్తీకేయన్
సంగీతందిబు నిన్నాన్ థామస్
ఛాయాగ్రహణంబి. ఆండ్రీవ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
విడుదల
23 ఆగస్టు 2019 (2019-08-23)
నిడివి
149 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కౌసల్య కృష్ణమూర్తి 2019, ఆగస్టు 23న విడుదలైన క్రీడా నేపథ్య తెలుగు చలనచిత్రం.[1] క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రానికి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్ రాజు, శివ కార్తీకేయన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా దిబు నిన్నాన్ థామస్ సంగీతం అందించాడు.[2] 2018లో తమిళంలో వచ్చిన కనా సినిమాకు ఇది రిమేక్. ఐశ్వర్య రాజేష్, శివ కార్తీకేయన్ లకు తెలుగులో ఇది తొలిచిత్రం. శివ కార్తీకేయన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తమిళ మాతృక నుండి తీసుకోబడ్డాయి.[3][4]

కథా సారాంశం[మార్చు]

కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) కి వ్య‌వ‌సాయం అంటే ఎంతిష్ట‌మో, క్రికెట్ కూడా అంతే ఇష్టం. క్రికెట్ లో భారతదేశం ఓడిపోతే అస్స‌లు త‌ట్టుకోలేడు. కౌసల్య (ఐశ్వ‌ర్య రాజేష్‌) కూడా తండ్రిని చూసి క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంటుంది. ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకొని తన స్నేహితులతో క్రికెట్ ఆడుతుంది. అబ్బాయిల‌తో క్రికెట్ ఆడుతుండడం చూసి తల్లి (ఝాన్సీ) అడ్డుకుంటూ ఉంటుంది, ఊళ్లో వాళ్లు కూడా సూటిపోటి మాట‌లు అంటుంటారు. అయినాకాని వాట‌న్నింటినీ త‌ట్టుకుని కౌసల్య‌ క్రికెట‌ర్‌గా అడుగులు వేస్తుంది. అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిందా, లేదా, త‌న ల‌క్ష్యం కోసం కౌస‌ల్య ఎన్నికష్టాలు ప‌డిందనేది మిగతా కథ.[5]

నటవర్గం[మార్చు]

 • ఐశ్వర్య రాజేష్ (కౌసల్య కృష్ణమూర్తి)
 • రాజేంద్ర ప్రసాద్ (కృష్ణమూర్తి)
 • కార్తీక్ రాజు (సాయి)
 • శివ కార్తీకేయన్ (నెల్సన్ దిలీప్ కుమార్)
 • ఝాన్సీ (సావిత్రి-కౌలస్య తల్లి)
 • వెన్నెల కిషోర్ (ఇన్స్పెక్టర్ బలరాం)
 • భీమినేని శ్రీనివాసరావు (బ్యాంక్ మేనేజరు)
 • రవి ప్రకాష్ (స్కూల్ పిఈటి)
 • శశాంక్
 • సి.వి.ఎల్. నరసింహరావు
 • రంగస్థలం మహేష్
 • టాక్సీవాలా విష్ణు
 • నటాష పరాషర్
 • నిరాళి ఓజా (గాయత్రి దీక్షిత్)
 • షైలా ఆలం (అంజలి శర్మ)
 • సుశ్రీ ప్రధాన్ (దీపికా పటేల్)
 • రమ్య జెస్టిన్ (రమ్య)
 • సజన సాజీవన్ (సజన)

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

చిత్ర సమర్పకులు కె.ఎస్. రామారావు తమిళ చిత్రం కనా ట్రైలర్ చూసి తెలుగులో పునఃనిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. కౌసల్య కృష్ణమూర్తి పేరుతో తెలుగులో పునఃనిర్మాణం చేయబడి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించబడింది.[6]

మార్కెటింగ్ - విడుదల[మార్చు]

2019, జూన్ 18న ఈ చిత్ర అధికారిక టీజర్‌ సోనీ మ్యూజిక్ ఇండియా ద్వారా విడుదలయింది.[7] రెండు నెలల తరువాత, 2019 ఆగస్టు 19న అధికారిక ట్రైలర్‌ సోనీ మ్యూజిక్ ఇండియా ద్వారా విడుదలయింది.[8] ఈ చిత్రం 2019, ఆగస్టు 23న విడుదలయింది.[1]

పాటలు[మార్చు]

తమిళ మాతృకకు సంగీతం అందించిన దిబు నిన్నాన్ థామస్ తెలుగు సినిమాకు కూడా సంగీతం అందించాడు. చిత్రంలోని మొదటి పాట ట్యూన్ కనా చిత్రం నుండి తీసుకోబడింది.[9]

Untitled


క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ముద్దబంతి (రచన: కృష్ణకాంత్)"  యాజీన్ నజీర్ 4:12
2. "రాకాస గడుసు పిల్ల (రచన: రాంబాబు గోసాల)"  అనన్య నాయర్, రాహుల్ సిప్లిగంజ్,రోషిత 4:08
3. "రేపటి కల (రచన: రామజోగయ్య శాస్త్రి)"  స్వరాగ్ కీర్తన్, మనీషా ఎర్రబత్తిని 4:12
4. "సావల్ (రచన: కాసర్ల శ్యామ్‌)"  ఎల్.వి. రేవంత్ 3:56
5. "ఊగే పచ్చని (రచన: కాసర్ల శ్యామ్‌)"  అనురాగ్ కులకర్ణి 4:48
21:16

రేటింగ్[మార్చు]

 1. 123తెలుగు - 3/5[10]
 2. టైమ్స్ ఆఫ్ ఇండియా - 2.5/5[11]
 3. దక్కన్ క్రానికల్- 2.5/5[12]
 4. గ్రేట్ ఆంధ్ర - 2.5/5[13]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 The Times of India, Entertainment (19 August 2019). "Kousalya Krishnamurthy trailer impresses fans" (ఆంగ్లం లో). మూలం నుండి 9 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 2. The Indian Express, entertainment (13 March 2019). "Aishwarya Rajesh's next Telugu film Kowsalya Krishnamurthy Cricketer goes on floors". Gabbeta Ranjith Kumar. మూలం నుండి 31 మార్చి 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 3. The Times of India, Entertainment (26 May 2019). "Aishwarya Rajesh debuts in Tollywood with Kousalya Krishnamurthy - Times of India" (ఆంగ్లం లో). మూలం నుండి 30 మే 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 4. The News Minute, Cinema (22 June 2019). "Sivakarthikeyan to make his Telugu debut in 'Kanaa' remake". మూలం నుండి 24 జూన్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 5. ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌస‌ల్య కృష్ణమూర్తి". www.eenadu.net. మూలం నుండి 23 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 10 January 2020.
 6. Telangana Today, Entertainment (22 June 2019). "Inspirational tale of Kausalya Krishnamurthy". Prakash Pecheti. మూలం నుండి 1 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 జనవరి 2020. Cite news requires |newspaper= (help); Check date values in: |archivedate= (help)
 7. "Kousalya Krishnamurthy Official Teaser - Aishwarya Rajesh, Rajendra Prasad, Sivakarthikeyan". YouTube. Sony Music South. 18 June 2019. మూలం నుండి 7 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020.
 8. "Kousalya Krishnamurthy Official Trailer - Aishwarya Rajesh, Rajendra Prasad, Sivakarthikeyan". YouTube. Sony Music South. 19 August 2019. మూలం నుండి 4 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020.
 9. Times of India, Entertainment (25 June 2019). "Kousalya Krishnamurthy". మూలం నుండి 30 జూన్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 10. 123telugu, Movie Review (23 August 2019). "Kousalya Krishnamurthy Telugu Movie Review". 123telugu.com (ఆంగ్లం లో). మూలం నుండి 14 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020.
 11. Times of India, Entertainment (23 August 2019). "Kousalya Krishnamurthy Movie Review". మూలం నుండి 24 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 12. Deccan Chronicle, Entertainment (25 August 2019). "Kousalya Krishnamurthy movie review: This sports drama is impressive only in parts!" (ఆంగ్లం లో). Suresh Kavirayani. మూలం నుండి 26 ఆగస్టు 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020. Cite news requires |newspaper= (help)
 13. Great Andhra, Movie Review (23 August 2019). "Kousalya Krishnamurthy Movie Review: Cliched Cricket Drama". greatandhra.com (ఆంగ్లం లో). Venkat Arikatla. మూలం నుండి 1 డిసెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 January 2020.

ఇతర లంకెలు[మార్చు]