కాసర్ల శ్యామ్
| కాసర్ల శ్యామ్ | |
|---|---|
| జననం | వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ |
| వృత్తి | గీతరచయిత, గాయకుడు |
| మతం | హిందూ |
| భార్య / భర్త | రాధిక |
| పిల్లలు | అనిరుధ్[1], లిఖిత్ సాయిరామ్ |
| తండ్రి | మధుసూదన్ రావు |
| తల్లి | మాధవి |
కాసర్ల శ్యామ్ వర్థమాన సినీ పాటల రచయిత. మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటతో గుర్తింపు పొందాడు.[2][3][4][5][6]
బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ఊరు పల్లెటూరు అనే గీతానికి గాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[7][8][9] ఆయన 2025 సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు.[10]
జీవిత విశేషాలు
[మార్చు]కాసర్ల శ్యాం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడలో మధుసూదన్ రావు, మాధవి దంపతులకు రెండోవ సంతానంగా జన్మించారు తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు. దీంతో శ్యామ్‌కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయన లాగే నటుడు కావాలని తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళలశాఖ విభాగంలో ఎంఫిల్ చదివాడు.
చిన్నతనం నుండే శ్యాం సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవాడు. అలా పాటలు పాడడం, రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు. అనేక వేదికలపై జానపదనృత్యాలు చేయడంతో పాటు, పాటలూ పాడాడు. వరంగల్ శంకర్, సారంగపాణిల బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా ఎదిగి వచ్చాడు.
సినిమాలకు రాకముందు కాసర్లశ్యాం వేలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకువచ్చాడు. సుమారు 50పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయన పాటలు రాశారు. “కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో..” అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే.
2003లో దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలతో పరిశ్రమలో గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన లై చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత గీతాలు రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్, రాంగోపాల్ వర్మతో రౌడీ, అనుక్షణం అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, వెంకటేశ్ హీరోగా వచ్చిన బాబు బంగారం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కిక్.2, ప్రేమకథా చిత్రమ్, గల్ఫ్ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాసాడు. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. [11]
పాటలు
[మార్చు]| సంవత్సరం | పేరు | సంగీత దర్శకుడు | పాటలు | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2003 | చంటిగాడు | వందేమాతరం శ్రీనివాస్ | "కొక్కొరొకో"
"సిగ్గులొలికే సీతాలు" |
||
| 2005 | ప్రేమికులు | సాజన్ | "లవెరా జోరు" | ||
| 2009 | మహాత్మ | విజయ్ ఆంటోనీ | "నీలా పూరి" | గాయకుడిగా కూడా | |
| 2012 | బస్ స్టాప్ | జీవన్ బాబు | "కలలకే కనులొచ్చిన" | ||
| మా అబ్బాయి ఇంజినీరింగ్ స్టూడెంట్ | చిన్ని చరణ్ | "నిన్నే నీకు చూపుదేహి" | |||
| 2013 | ప్రేమకథా చిత్రమ్ | జీవన్ బాబు | "ఐ జస్ట్ లవ్ యు బేబీ"
"కొతగున్న హాయే" "ఓ మై లవ్" |
||
| వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | రమణ గోగుల | "మెల్లమెల్లగా" | |||
| 2014 | రియల్ స్టార్ | వందేమాతరం శ్రీనివాస్ | "కండ్లల్లో చురుకుతనం" | ||
| లవ్ యు బంగారమ్ | మహిత్ నారాయణ్ | "జై శంభో శంభో"
"అన్నువనువునా చెలియ" |
|||
| రౌడీ | సాయి కార్తీక్ | అన్ని పాటలు | గీత రచయితగా మొదటి సింగిల్ కార్డ్ | ||
| 2015 | కిక్ 2 | థమన్ ఎస్ | "కిక్" | ||
| 2016 | మెంటల్ | ‘చీకటి చీల్చగ.. సూటిగ | |||
| సుప్రీమ్ | సాయి కార్తీక్ | "ట్యాక్సీ వాలా" | |||
| బాబు బంగారం | జిబ్రాన్ | టిక్కు టిక్కంటూ | |||
| జక్కన్న | దినేష్ | "యు ఆర్ మై డార్లింగో.. లింగో లింగో లింగ్" | |||
| బంతిపూల జానకి | భోలే | అన్ని పాటలు | |||
| 2017 | నక్షత్రం | మణి శర్మ | "లాయిరే లాయిరే" | ||
| గల్ఫ్ | ప్రవీణ్ ఇమ్మడి | 'ఆశల రెక్కలు కట్టుకొని పొట్టను చేతిలో పట్టుకొని' | |||
| లై | మణి శర్మ | ‘బొమ్మోలే ఉన్నదిర పోరీ.. బాంభాట్ గుందిరా నారీ..’ | |||
| రాజా ది గ్రేట్ | సాయి కార్తీక్ | "రాజా రాజా రాజా.. ది గ్రేట్ రా" | |||
| 2018 | నీదీ నాదీ ఒకే కథ | సురేష్ బొబ్బిలి | "ఏందిరా ఈ జనాల గోల?" | ||
| 2019 | వెంకీ మామ | థమన్ ఎస్ | "కోకా కోలా పెప్సి" | ||
| 2020 | అల వైకుంఠపురములో | థమన్ ఎస్ | ‘రాములో రాములా.. నన్నాగం జేసిందిరో’ | [12] | |
| భీష్మ | మహతి స్వర సాగర్ | వ్వాట్టే బ్యూటీ | |||
| సవారి | శేఖర్ చంద్ర | నీ కన్నులు | |||
| ఒరేయ్ బుజ్జిగా | అనూప్ రూబెన్స్ | కురిసేనా, కలలు చూసిన కన్నులే | |||
| 2021 | రాబర్ట్ | అర్జున్ జన్య | "కన్నె అదిరింధి"
"బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ" |
||
| 2022 | రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం | మణిశర్మ | అన్ని పాటలు | ||
| డీజే టిల్లు | శ్రీ చరణ్ పాకాల | "డీజే టిల్లు టైటిల్ సాంగ్ " | |||
| ఎఫ్ 3 | థమన్ ఎస్ | "లైఫ్ అంటే మినిమం ఇట్లా వుండాలా" | |||
| పంచతంత్ర కథలు | కమ్రాన్ | "నేనేమో మోతెవరి, నువ్వేమో తోతాపరి" | |||
| 2023 | దసరా | సంతోష్ నారాయణన్ | "చమ్కీల అంగిలేసి ఓ వదినే" | ||
| దాస్ కా ధమ్కీ | లియోన్ జేమ్స్ | మావ బ్రో | |||
| కథ వెనుక కథ | శ్రవణ్ భరద్వాజ్ | ||||
| బలగం | భీమ్స్ సిసిరోలియో | "ఊరు పల్లెటూరు" | ఊరు పల్లెటూరు గీతానికి గాను జాతీయ అవార్డు అందుకున్నాడు | [13] | |
| రామన్న యూత్ | కమ్రాన్ | "ఓఓ సుందరి" | |||
| అన్‌స్టాపబుల్ | భీమ్స్ సిసిరోలియో | ||||
| రామబాణం | మిక్కీ జె. మేయర్ | ఐ ఫోన్ సాంగ్ | |||
| భాగ్ సాలే | కాల భైరవ | "ప్రేమ కోసం" | |||
| ఇంటింటి రామాయణం | కల్యాణి మాలిక్ | అన్ని పాటలు | |||
| రావణాసుర | హర్షవర్ధన్ రామేశ్వర్ | "ప్యార్ లోనా పాగల్"
"దిక్కా డిషుం" |
|||
| రంగమర్తాండ | ఇళయరాజా | పొదల పొదల గట్ల నడుమ | |||
| స్లమ్ డామ్ హస్బెండ్ | భీమ్స్ సిసిరోలియో | "లచ్చి గాని పెళ్లి"
"మేరా చోటా దిల్" |
|||
| భోళా శంకర్ | మహతి స్వర సాగర్ | "జామ్ జామ్ జజ్జనక"
"కొట్టర కొట్టు తీనుమారు" |
|||
| రూల్స్ రంజన్ | అమ్రేష్ గణేష్ | "ధేఖో ముంబై" | |||
| రాక్షస కావ్యం | ఆర్.ఆర్. ధ్రువన్ | విలన్స్ ఆంథెమ్ | |||
| ప్రేమదేశపు యువరాణి | అజయ్ పట్నాయక్ | "మస్కతడి"
"తోలి ముద్దు" |
|||
| స్కంద | ఎస్.ఎస్. థమన్ | "అలబా అలబలబా" | |||
| ప్రేమ విమానం | అనూప్ రూబెన్స్ | ''అజనకబజనక'' | |||
| భగవంత్ కేసరి | ఎస్.ఎస్. థమన్ | "రోర్ ఆఫ్ కేసరి"
"గణేష్ అంథెం" |
|||
| ఆదికేశవ | జి. వి. ప్రకాష్ | "లీలమ్మ" | |||
| ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ | గురురాజ్ | "పెట్టే తలం" | |||
| బబుల్‌గమ్ | శ్రీ చరణ్ పాకాల | "హబీబీ జిలేబీ" | |||
| అథర్వ | శ్రీచరణ్ పాకాల | ఛాంగు ఛాంగురే | |||
| 2024 | సర్కారు నౌకరి | సురేష్ బొబ్బిలి | "నీ పసుపు పాదాలే" | ||
| హను మాన్ | హరి గౌర | "పూలమ్మే పిల్ల" | |||
| రజాకార్ | భీమ్స్ సిసిరోలియో | భారతి భారతి ఉయ్యాలో | |||
| లంబసింగి | ఆర్.ఆర్. ధృవన్ | "వయ్యారి గోదారి"
"నచ్చేసిందే నచ్చేసిందే" |
|||
| డబుల్ ఇస్మార్ట్ | మణిశర్మ | "మార్ ముంతా చోడ్ చింతా" | |||
| మిస్టర్ బచ్చన్ | మిక్కీ జె. మేయర్ | "రెప్పల్ డప్పుల్" | |||
| భారతీయుడు-2 | అనిరుధ్ రవిచందర్ | "తాత వస్తాడే" | |||
| మనమే | హేశం అబ్దుల్ వహాబ్ | "తప్పా తప్పా" | |||
| గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి | యువన్ శంకర్ రాజా | "గిరి గిరి" | |||
| బూట్‌కట్ బాలరాజు | భీమ్స్ సిసిరోలియో | "మల్లి మల్లి" | |||
| లీగల్లీ వీర్ | శంకర్ తమిరి | ||||
| రాజు యాదవ్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | "దిస్ ఈజ్ మై దరిద్రమ్" | |||
| ప్రతినిధి 2 | మహతి స్వర సాగర్ | "గల్లా ఏత్తి" | |||
| డార్లింగ్ | వివేక్ సాగర్ | అన్ని పాటలు | |||
| పొట్టెల్ | శేఖర్ చంద్ర | అన్ని పాటలు | |||
| విడుదల పార్ట్ 2 | ఇళయరాజా | ''మనసులో''
''పావురమా పావురమా'' |
|||
| భరతనాట్యం | వివేక్ సాగర్ | ''డుగు డుగు'' | |||
| కేశవ చంద్ర రమావత్ | చరణ్ అర్జున్ | "యాది యాది" | |||
| ఆయ్ | రామ్ మిరియాల | ''డైవర్షన్ బ్యూటీ'' | |||
| 2025 | డాకు మహారాజ్ | థమన్ ఎస్ | "దబిడి దిబిడి"
"సర్కారు రా" |
||
| గేమ్ ఛేంజర్ | థమన్ ఎస్ | "అరుగు మీద"
"కొండ దేవర" |
|||
| గాంధీ తాత చెట్టు | రీ | "ధగడ్ పిల్ల"
"ఓలే సంధమామా" |
|||
| రెట్రో | సంతోష్ నారాయణన్ | అన్ని పాటలు | |||
| మ్యాడ్ స్క్వేర్ | భీమ్స్ సిసిరోలియో | "లడ్డు గానీ పెళ్లి" | |||
| భైరవం | శ్రీచరణ్ పాకాల | "గిచ్చమాకు" | |||
| సోలో బాయ్ | జూడా సాంధీ | "సోలో బాయ్ - టైటిల్ సాంగ్" | |||
| తమ్ముడు | బి. అజనీష్ లోక్‌నాథ్ | "చిల్లాక్స్ సాంగ్" | |||
| ఓ భామ అయ్యో రామ | రధన్ | "గల్లీ స్టెప్" | |||
| ఒక బృందావనం | సన్నీ - సాకేత్ | "హే కదిలే కన్నులు" | |||
| కొత్తపల్లిలో ఒకప్పుడు | రధన్ | "యేలో యెన్నెల్లో"
"జై బోలో" |
|||
| అరి | |||||
| మిత్రమండలి | ఆర్.ఆర్. ధృవన్ | "కత్తందుకో జానకి" | [14] | ||
| కలివి వనం | మదిన్ ఎస్.కె | "ప్రాణాలు పోసే వనము" | |||
| పాంచ్ మినార్ | శేఖర్ చంద్ర | "మందు తేరా" | |||
| అఖండ 2 | థమన్ ఎస్ | "జాజికాయ జాజికాయ" | [15] | ||
| ఛాంపియన్ | మిక్కీ జె. మేయర్ | "గిర గిర గిరగింగిరాగిరే" | [16] | ||
| 2026 | సీతా పయనం | అనూప్ రూబెన్స్ | ''బసవన్న'', ''ప్రయాణమే'' |
సంగీత దర్శకుడిగా
[మార్చు]టెలివిజన్
[మార్చు]- స రే గ మా ప - ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ - న్యాయనిర్ణేతగా
మూలాలు
[మార్చు]- ↑ "కొడుకు బర్త్ డే.. కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్". Zee News Telugu. 26 December 2022. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ ఈనాడు, ఆదివారం అనుబంధం (19 April 2020). "వర్మ మాటలకి కన్నీళ్లొచ్చేశాయి!". www.eenadu.net. Archived from the original on 19 April 2020. Retrieved 19 April 2020.
- ↑ "Kasarla Shyam: There's a unique energy in the Telangana dialect" (in ఇంగ్లీష్). The New Indian Express. 12 April 2025. Retrieved 12 April 2025.
- ↑ "'నీలపురి టూ రాములో రాముల' వరకు కాసర్ల శ్యాం జర్నీ". Chitrajyothy. 8 June 2025. Archived from the original on 9 June 2025. Retrieved 9 June 2025.
- ↑ "నాతో నేనే పోటీపడతా". Andhrajyothy. 8 June 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "మురిసిన 'ఓరుగల్లు' పల్లెపదం". Eenadu. 2 August 2025. Archived from the original on 2 August 2025. Retrieved 2 August 2025.
- ↑ "'ఊరు పల్లెటూరు' పాటకు జాతీయ స్థాయి గుర్తింపు.. అదృష్టంగా భావిస్తున్నా: కాసర్ల శ్యామ్". Eenadu. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన". Andhrajyothy. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "ఉత్తమ తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి'.. ఉత్తమ పాట 'ఊరు పల్లెటూరు'". Eenadu. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "'బలగం'కు జాతీయ గౌరవం: రాష్ట్రపతి చేతుల మీదుగా కాసర్ల శ్యామ్ కు అవార్డు ప్రదానం". V6 Velugu. 23 September 2025. Archived from the original on 23 September 2025. Retrieved 23 September 2025.
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య ఓపెన్ పేజి (10 November 2019). "తెలంగాణ యాసే నా విజిటింగ్ కార్డ్". www.andhrajyothy.com. Archived from the original on 11 November 2019. Retrieved 11 November 2019.
- ↑ Namasthe Telangana (24 April 2021). "ఆగం జేసిండురో!". Namasthe Telangana. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
- ↑ "విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం." Andhrajyothy. 23 September 2025. Archived from the original on 23 September 2025. Retrieved 23 September 2025.
- ↑ "'కత్తందుకో జానకి'.. రెబల్ స్టార్ డైలాగ్‌తో సాంగ్, మిత్రోం ఆ మాత్రం ఉండాలిగా..!". ABP Desam. 23 June 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
- ↑ "అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ రిలీజ్.. బాలయ్య మాస్ స్టెప్పులు". Hindustan Times. 18 November 2025. Archived from the original on 19 November 2025. Retrieved 19 November 2025.
- ↑ "గిర గిర గిరగింగిరాగిరే.. రోషన్ 'ఛాంపియన్' నుంచి ఫస్ట్ సింగిల్". NT News. 26 November 2025. Archived from the original on 10 December 2025. Retrieved 10 December 2025.