Jump to content

లంబసింగి (2024 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
లంబసింగి
దర్శకత్వంనవీన్‌గాంధీ
రచననవీన్‌గాంధీ
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతటీ. ఆనంద్
తారాగణం
  • భరత్‌
  • దివి వడ్త్యా
ఛాయాగ్రహణంకె. బుజ్జి
కూర్పుకె. విజయ్ వర్ధన్
సంగీతంఆర్ఆర్ ధృవన్
నిర్మాణ
సంస్థ
కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీ
2024 మార్చి 15 (2024-03-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

లంబసింగి 2024లో విడుదలైన తెలుగు సినిమా. కల్యాణ్‌కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై టీ. ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకు నవీన్‌గాంధీ దర్శకత్వం వహించాడు. భరత్‌, దివి వడ్త్యా, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది.[1]

లంబసింగి సినిమా ఏప్రిల్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

లంబ‌సింగి పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేసే వీర‌బాబు (భరత్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌) అదే ఊర్లో ఉండే న‌ర్సు హరిత (దివి వాద్యా)ను ప్రేమిస్తుంటాడు. అమెకు ప‌లుమార్లు త‌న ప్రేమ‌ను చెప్పిన‌ప్ప‌టికీ ఆమె అంగీక‌రించ‌దు. ఈ క్రమంలో ఒక రోజు కొంద‌రు మావోయిస్టులు స్టేష‌న్‌పై దాడి చేయగా ఆ దాడిలో హ‌రిత కూడా పాల్గొంటుంది. హరిత ఉండటం చూసి ఆమె నర్సు కాదు నక్సలైట్ అని వీర‌బాబు తెలుసుకుంటాడు. ఆస‌లు హ‌రిత ఎవరు ? ఆమెకు మావోయిస్టులకు ఏమిటి సంబంధం? వీర‌బాబు ఆ త‌ర్వాత ఏం చేశాడు, వారు ప్రేమించ‌కున్నారా, వీర‌బాబు ప్రేమ‌ను హరిత ఒప్పుకుందా ? చివ‌రికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]
  • భరత్‌
  • దివి వడ్త్యా
  • వంశీ రాజ్
  • కిట్టయ్య
  • నిఖిల్ రాజ్
  • జనార్దన్
  • అనురాధ
  • మాధవి
  • నవీన్ రాజ్ సంకరపు
  • ప్రమోద్
  • రమణ
  • పరమేష్
  • సంధ్య

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కురసాల[5]
  • బ్యానర్: కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌
  • నిర్మాత: టీ. ఆనంద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌గాంధీ
  • సంగీతం: ఆర్ఆర్ ధృవన్
  • సినిమాటోగ్రఫీ: కె. బుజ్జి
  • ఎడిటర్: కె. విజయ్ వర్ధన్
  • పాటలు: కాసర్ల శ్యామ్

పాటలు

[మార్చు]
Track listing
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వయ్యారి గోదారి[6]"కాసర్ల శ్యామ్జావేద్ అలీ4:16
2."నచ్చేసిందే నచ్చేసిందే"కాసర్ల శ్యామ్సిద్ శ్రీరామ్[7]4:22
3."రామ సిలకా"అలరాజుఆర్ఆర్ ధృవన్3:05

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (7 March 2024). "హీరోయిన్‌గా 'బిగ్ బాస్' దివి - 'లంబసింగి' విడుదలకు రెడీ, ఎప్పుడంటే?". the original నుండి 8 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2024.
  2. NT News (30 March 2024). "రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా!". the original నుండి 2 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 April 2024.
  3. Sakshi (15 March 2024). "'లంబసింగి' మూవీ రివ్యూ". the original నుండి 2 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 April 2024.
  4. 10TV Telugu (15 March 2024). "లంబసింగి మూవీ రివ్యూ.. పోలీస్ కానిస్టేబుల్‌కి, లేడీ నక్సలైట్‌కి మధ్య ప్రేమ కథ." the original నుండి 2 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (15 April 2022). "'బంగార్రాజు' దర్శకుడి సమర్పణలో 'లంబసింగి'". the original నుండి 8 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 March 2024.
  6. Chitrajyothy (7 March 2024). "వయ్యారి గోదారి.. లిరికల్ సాంగ్". the original నుండి 19 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 March 2024.
  7. TV9 Telugu (18 April 2022). "మరోసారి కట్టిపడిసిన సిద్ శ్రీరామ్.. ఆకట్టుకుంటున్న 'లంబాసంగి' పాట." the original నుండి 19 March 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]