బంతిపూల జానకి

బంతిపూల జానకి 2016 తెలుగు సినిమా.[1][2][3][4]. ఈ చిత్ర నటులలో ఎక్కువమంది జబర్దస్త్ సీరియల్లోని వారే.[5].సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయింది.[6]
కథ[మార్చు]
జానకి (దీక్షా పంత్)కి మోడల్ కావాలనేది కోరిక. ఆమె స్నేహితుడు శ్యామ్ (ధన్‌రాజ్) మరో అడుగు ముందుకేసి ఆమెను సినిమా నటిని చేయాలనుకుంటాడు. బంతిపూల జానకి అనే చిత్రంతో జానకికి ఏకంగా జాతీయ అవార్డు వస్తుంది. దాంతో ఆ సినిమా హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్), రచయిత (రాకెట్ రాఘవ), దర్శకుడు (చమ్మక్ చంద్ర), నిర్మాత అహంకారం (అదుర్స్ రఘు) జానకి ఇంటికి వస్తారు. శ్యామ్‌ని జానకి ఫ్రెండ్‌గా కాకుండా ఓ పనోడిగా చూస్తుంటారు. అతన్ని వంట చేయమని పురమాయిస్తారు. ఆ నలుగురూ తెచ్చిన ఖరీదైన బహుమతులను, వారి ప్రవర్తనను చూసిన శ్యామ్ చిన్నబుచ్చుకుంటాడు. అతన్ని తాజా చేయడానికి జానకి వంటింట్లోకి వెళ్తుంది. కానీ ఏదో వంకతో అక్కడి నుంచి వెళ్తాడు శ్యామ్. అదే అదనుగా చూసుకుని హీరో ఆకాష్ వంటింట్లోకి దూరి జానకితో అసభ్యకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని ఆమె విసురుగా తోసేయడంతో వెల్లకిలా పడి తల వెనుకభాగం పగిలి చనిపోతాడు. అతని శవాన్ని దాచడానికి ఆమె ఎలాంటి పాట్లు పడింది? ఆకాష్ గురించి శ్యామ్‌తో పంచుకుందా? లేదా? ఆకాష్ శవాన్ని దాచే క్రమంలో అడ్డు తగిలిన దర్శకుడిని ఏం చేశారు? నిర్మాత పరిస్థితి ఏమైంది? జానకిని గాఢంగా ప్రేమించిన రచయిత ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు? మధ్యలో దొంగ (షకలక శంకర్)కి అక్కడ జరిగిన హత్యలతో సంబంధం ఎలా ఏర్పడింది? పోలీస్ (భరత్) అనుమానాలేంటి? అవి నిజమయ్యాయా? వంటివన్నీ సినిమా లో భాగంగా కొనసాగుతాయి.
నటులు[మార్చు]
- ధన్‌రాజ్
- దీక్షా పంత్[7]
- చమ్మక్ చంద్ర
- సుడిగాలి సుధీర్
- రాకెట్ రాఘవ
- షకలక శంకర్
- భరత్ రెడ్డి