జబర్‌దస్త్

వికీపీడియా నుండి
(జబర్దస్త్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జబర్‌దస్త్
Jabardasth poster.jpg
దర్శకత్వంనందిని రెడ్డి
రచనవెలిగొండ శ్రీనివాస్
స్క్రీన్ ప్లేనందిని రెడ్డి
కోన వెంకట్
కథనందిని రెడ్డి
నిర్మాతబెల్లంకొండ సురేశ్
తారాగణంసిద్దార్థ్
సమంత
నిత్యా మీనన్
శ్రీహరి (నటుడు)
వెన్నెల కిశోర్
ఛాయాగ్రహణంమహేష్ ముతుస్వామి
సంజయ్ లోక్నాధ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్ర్స్
పంపిణీదార్లు7SEAS Inc (విదేశాలు) [1]
విడుదల తేదీ
2013, ఫిబ్రవరి
సినిమా నిడివి
150 ని.మి.
దేశంభారత్
భాషతెలుగు

మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారి సమర్పణలో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్ర్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ గారు నిర్మించిన చిత్రం జబర్‌దస్త్. సిద్దార్థ్, సమంత, నిత్యా మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఎస్. ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలందించారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 22, 2013 న విడుదలైంది.

కథ[మార్చు]

బైర్రాజు (సిద్దార్థ్) ఊరంతా అప్పులు చేసి పలు వ్యాపారాలు చేసి బాగా నష్టపోయి అప్పులవారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి పారిపోయి బిహార్ లో ఉంటాడు. అక్కడ కూడా అప్పులు చేసి పారిపోయి ఐదేళ్ళ తరువాత హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ పండుని (అర్జున్) కలిసి అతనితో ఉంటాడు. అనుకోకుండా ఓ పెళ్లిలో శ్రేయ (సమంత) అనుకుంటున్న ఐడియాని కాపీ కొట్టి ఫేమస్ మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజర్ పింకీ శర్మ దగ్గర తనకి రావాల్సిన ఉద్యోగం బైర్రాజు కొట్టేస్తాడు.

అది తెలుసుకున్న శ్రేయ – బైర్రాజుతో ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరూ ఆమె దగ్గర ఉద్యోగంలో చేరతారు. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోతారు. అసలు ఎందుకు విడిపోయారు? అలా విడిపోయిన వీరి జీవితాల్లోకి సరస్వతి (నిత్యా మీనన్), ఫేమస్ డాన్ జావేద్ భాయ్ (శ్రీహరి) ఎందుకు వచ్చారు? చివరికి వీరు కలిసారా? లేదా? అనేది మిగిలిన కథ.

నటులు[మార్చు]

సంగీతం[మార్చు]

జబర్‌దస్త్ ఆడియో వేడుక అన్నపూర్ణ స్టూడియోలో ఫిబ్రవరి 2, 2013 రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆవిష్కరించారు. తొలి కాపీలను హీరో సునీల్, శ్రీహరి అందుకున్నారు.[2] ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించింది.[3]

పాట గానం నిడివి
అరెరే అరెరే నిత్యమీనన్ 5:12
అల్లా అల్లా శ్రేయ ఘోషల్, రంజిత్, నవీన్ 4:06
మేఘమాల మురళీధర్, రాహుల్, రీట, వందన & మేఘ 5:26
తీస్ మార్ ఖాన్ నవీన్ 3:03
లష్కర్ పోరి మురళీధర్ 3:18

వివాదాలు[మార్చు]

ఈ చిత్ర కథను విజయవంతమైన హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ నుండి దర్శకురాలు నందిని రెడ్డి తస్కరించారనే వార్తలు వచ్చాయి. దీనిపై హిందీ చిత్ర మాతృక బృందం ఈమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సన్న్నాహాలు చేస్తున్నారు.[4][5]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.idlebrain.com/usschedules/jabardasth.html
  2. http://telugu.oneindia.in/movies/news/2013/02/jabardasth-audio-launched-111890.html[permanent dead link]
  3. http://www.123telugu.com/mnews/jabardasths-music-gets-decent-response.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-01. Retrieved 2013-02-26.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-28. Retrieved 2013-02-26.