బి. జయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. జయ
B. Jaya.png
జననంజనవరి 11 1964
రావులపాలెం, అడ్డతీగల మండలం, తూర్పు గోదావరి జిల్లా
మరణంఆగష్టు 30 2018
హైదరాబాదు
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తితెలుగు సినిమా దర్శకురాలు
క్రియాశీలక సంవత్సరాలు2002 – 2018
జీవిత భాగస్వామిబి.ఎ. రాజు

బి. జయ తెలుగు సినిమా దర్శకురాలు.[1] జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీవారపత్రికను స్థాపించి, ప్రేమలో పావని కళ్యాణ్‌ సినిమాతో దర్శకురాలిగా మారింది.[2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈవిడ జనవరి 11 1964తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, రావులపాలెం గ్రామంలో జన్మించింది. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (సైకాలజీ) చదివింది.[3]

సినీరంగ ప్రస్థానం[మార్చు]

చదువు పూర్తికాగానే ఆంధ్రజ్యోతి డైలీతో తన జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో పనిచేసింది. 2002లో దీపక్, అంకిత హీరో, హీరోయిన్స్ గా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రంద్వారా దర్శకురాలిగా మారింది. చంటిగాడు సినిమా దర్శకురాలిగా గుర్తింపునిచ్చింది. ఈ సినిమా 25 కేంద్రాలలో 100 రోజులు పూర్తిచేసుకుంది.

దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా[మార్చు]

క్రమసంఖ్య సంవత్సరం చిత్రంపేరు నటవర్గం ఇతర వివరాలు
1 2002 ప్రేమలో పావని కళ్యాణ్‌ దీపక్, అంకిత
2 2003 చంటిగాడు బాలాదిత్య, సుహాసిని
3 2005 ప్రేమికులు యువరాజ్, రిషి గిరీష్, కామ్నా జఠ్మలానీ
4 2007 గుండమ్మగారి మనవడు ఆలీ, సింధూరి
5 2008 సవాల్ భరత్, సుహానీ
6 2012 లవ్‌లీ ఆది, శాన్వీ
7 2016 వైశాఖం[1] హరీశ్, అవంతిక చిత్రీకరణ

మరణం[మార్చు]

గుండె పోటు కారణంగా హైదరాబాదు లో ఆగష్టు 30 2018 న మరణించింది.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రభూమి. "ప్రేమలో కొత్త ఫీల్ -దర్శకురాలు బి.జయ". Retrieved 23 May 2017.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "జయ బి. , Jaya B". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 24 May 2017. Check date values in: |archive-date= (help)
  3. నవతెలంగాణ, మానవి (18 February 2018). "కథ నచ్చితేనే." వి.యశోద. Retrieved 6 March 2018.
  4. సాక్షి, సినిమా (1 September 2018). "డైనమిజం". Archived from the original on 20 November 2018. Retrieved 20 November 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=బి._జయ&oldid=2954536" నుండి వెలికితీశారు