కామ్నా జఠ్మలానీ
స్వరూపం
కామ్నా జఠ్మలానీ | |
---|---|
జననం | 1985 డిసెంబరు 10 |
వృత్తి | నటి, ప్రచార కర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2004 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సూరజ్ నాగ్ పాల్ |
కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి, ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
జననం
[మార్చు]కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబరు 10న ముంబైలో జన్మించింది.[1] తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.
వివాహం
[మార్చు]కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[2]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రం పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2005 | ప్రేమికులు | వెన్నెల | తెలుగు | |
2005 | ఇదయా తిరుడన్ | దీపిక | తమిళం | |
2006 | రణం | మహేశ్వరి | తెలుగు | |
2006 | సామాన్యుడు | వందన | తెలుగు | |
2006 | సైనికుడు | తెలుగు | ప్రత్యేక పాట | |
2007 | టాస్ | తెలుగు | ||
2007 | ఉగాది | కావేరి | కన్నడ | అమెరికా అల్లుడుగా 2011లో తెలుగులోకి అనువాదం |
2007 | మచకారన్ | శివాని రాజాంగాం | తమిళం | ధీరగా 2009 లో తెలుగులోకి అనువాదం |
2009 | అందమైన అబద్దం | వైష్ణవి | తెలుగు | |
2008 | కింగ్ | కామ్నా | తెలుగు | నువ్వు రెడీ పాటలో |
2009 | బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి | పద్మప్రియ | తెలుగు | |
2009 | రాజాధిరాజా | తమిళం | ||
2010 | కత్తి కాంతారావు | రత్నం | తెలుగు | |
2011 | మేకప్ మాన్ | చంద్ర | మలయాళం | అతిథి పాత్ర |
2011 | కసేతన్ కడవులాడ | అర్చన | తమిళం | |
2013 | యాక్షన్ 3D | అనిత | తెలుగు | |
2013 | శ్రీ జగద్గురు ఆది శంకర | రాణి | తెలుగు | |
2013 | భాయ్ | కాలనీ అమ్మాయి | ||
2014 | అగ్రజా | కన్నడ | ||
2015 | చంద్రిక | కన్నడ |
వెబ్‌సిరీస్
[మార్చు]- వ్యవస్థ (2023)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "కామ్నా జఠ్మలానీ". telugu.filmibeat.com. Retrieved 5 May 2017.
- ↑ ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.[permanent dead link]