సింధూరి (నటి)
సింధూరి | |
---|---|
జననం | |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
సింధూరి, దక్షిణ భారత సినిమా నటి. తమిళ, తెలుగు, మలయాళ సినిమాలలో నటించింది. 2003లో బాయ్స్ సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి అరంగేట్రం చేసిన తరువాత, 2004లో సూపర్ డా, 2007లో గుండమ్మగారి మనవడు వంటి సినిమాలలో నటించింది.
సినిమారంగం
[మార్చు]2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ (2003) సినిమాలో సహాయక పాత్రను పోషించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అందులో జెనీలియా నలుగురు స్నేహితులలో ఒకరిగా కనిపించింది. ఆ తరువాత తాతి తవాదు మనసు (2003), ఎన్నవో పుడిచిరుక్కు (2004) సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1] సూపర్ డా (2004), ఉనార్చిగల్ (2006) నటించింది. కన్నమపేటై, ఫ్లవర్స్ వంటి ఇతర సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.[2]
2007లో గుండమ్మగారి మనవడు అనే హాస్య తెలుగు సినిమాలో నటించింది. మలయాళ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి, శంబుతో 2004లో తీసిన సినిమా 2008లో థియేట్రికల్ విడుదలైంది.[3] ఆకర్షణీయమైన ఫోటోషూట్లలో పాల్గొంది, ఐటెమ్ పాటల్లో నటించడానికి ఆమె ఆసక్తిని వ్యక్తం చేసింది. [4]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2003 | బాయ్స్ | అంకిత | తమిళం | |
తాతి తవాధు మనసు | అముధ | తమిళం | ||
2004 | ఎన్నవో పుడిచిరుక్కు | సంగీత | తమిళం | |
సూపర్ డా | మీనాక్షి | తమిళం | ||
2007 | గుండమ్మగారి మనవడు | మహాలక్ష్మి | తెలుగు | |
నీరం | శ్వేత | తమిళం | ||
2008 | శంబు | అపర్ణ | మలయాళం | |
2013 | కదల్ కిలుకిలుప్పు | ఉమా మహేశ్వరి | తమిళం | |
2019 | బూమేరాంగ్ | శక్తి స్నేహితురాలు | తమిళం | |
2019 | ఎనై నోకి పాయుమ్ తోటా | శరణ్య | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ http://www.behindwoods.com/tamil-movie-news/may-06-03/19-05-06-sindhuri.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-17. Retrieved 2021-05-22.
- ↑ http://www.indiaglitz.com/shambu-malayalam-movie-preview-8759.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-17. Retrieved 2021-05-22.