Jump to content

అరుణాచలం

అక్షాంశ రేఖాంశాలు: 12°13′53.76″N 79°4′1.92″E / 12.2316000°N 79.0672000°E / 12.2316000; 79.0672000
వికీపీడియా నుండి
(అన్నామలై నుండి దారిమార్పు చెందింది)
అరుణాచలేశ్వర స్వామి దేవాలయం
అరుణాచలం కొండల పైనుండి దేవాలయ దృశ్యం
అరుణాచలం కొండల పైనుండి దేవాలయ దృశ్యం
అరుణాచలేశ్వర స్వామి దేవాలయం is located in Tamil Nadu
అరుణాచలేశ్వర స్వామి దేవాలయం
అరుణాచలేశ్వర స్వామి దేవాలయం
Location within Tamil Nadu
భౌగోళికాంశాలు :12°13′53.76″N 79°4′1.92″E / 12.2316000°N 79.0672000°E / 12.2316000; 79.0672000
పేరు
ప్రధాన పేరు :అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం
సంస్కృతం:అరుణాచలేశ్వరుడు
తమిళం:అరుల్మిగు అన్నామలైయర్ తిరుకోయిల్
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తిరువణ్ణామలై
స్థానికం:అరుణాచలం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అరుణాచలేశ్వర స్వామి
(పంచభూత లింగాలలో అగ్నిలింగం) (స్థానికం-అన్నామలైయర్) (శివుడు)
ప్రధాన దేవత:అపిత కుచళాంబికా అమ్మవారు
(స్థానికంగా - ఉన్నామలై అమ్మన్) (ఉమాదేవి అయిన పార్వతి)
పుష్కరిణి:అగ్ని తీర్థం, బ్రహ్మ తీర్థం
ముఖ్య_ఉత్సవాలు:కార్తీక దీపం
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రావిడ నిర్మాణశైలి

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.[1] అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది

గిరిప్రదక్షిణం

[మార్చు]

గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు

  • గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
  • బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
  • గిరిప్రదక్షణం 14 కి.మీ దూరం ఉంటుంది.
  • ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
  • గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
  • అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోర రాదు ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి.
  • చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
  • గిరిప్రదక్షణంలో "నేర్ (ఎదురుగా) శివాలయం" అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని.
  • నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
  • గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
  • అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తల పైన టోపీ లాంటివి ధరించకూడదు.
  • అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి.
  • గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి.
  • ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము అనేది కాకుండా, నిండు గర్భిణి వలే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
  • గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి.
  • మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నం దానం చెయ్యండి.విశేష ఫలితం కలుగుతుంది.
  • అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో " స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాధించు " అని కోరుకొని బయలుదేరండి.గిరి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
  • గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో వుంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చెయ్యండి.
  • గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చెయ్యండి.సాయంత్రం 4 తరువాత మొదలు పెట్టండి.
  • గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే, విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు.
  • సంతానం కోసం, వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహార్శి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు ( తాడు అక్కడ అమ్ముతుంటారు).అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది.
  • గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి.
  • గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటె కుడివైపు దేవతలు, సిద్దులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు.

అరుణాచల శివ నామాలు

[మార్చు]

అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. ఇవి మొత్తం 89 నామాలు.

అరుణాచల శివ నామాలు
శ్రోణాద్రీశుడు నిరంజనుడు విమలుడు
అరుణాద్రీశుడు జగన్నాధుడు నాగభూషణుడు
దేవాధీశుడు మహాదేవుడు అరుణుడు
జనప్రియుడు త్రినేత్రుడు బహురూపుడు
ప్రసన్న రక్షకుడు త్రిపురాంతకుడు విరూపాక్షుడు
ధీరుడు భక్తాపరాధ సోడూడు అక్షరాకృతి
శివుడు యోగీశుడు అనాది
సేవకవర్ధకుడు భోగ నాయకుడు అంతరహితుడు
అక్షిప్రేయామృతేశానుడు బాలమూర్తి శివకాముడు
స్త్రీపుంభావప్రదాయకుడు క్షమామూర్తి స్వయంప్రభువు
భక్త విఘ్నప్తి సంధాత ధర్మ రక్షకుడు సచ్చిదానంద రూపుడు
దీన బంధ విమోచకుడు వృషధ్వజుడు సర్వాత్మ
ముఖ రాంఘ్రింపతి హరుడు జీవధారకుడు
శ్రీమంతుడు గిరీశ్వరుడు స్త్రీసంగవామసుభగుడు
మృడుడు భర్గుడు విధి
ఆషుతోషుడు చంద్రశేఖరావతంసకుడు విహిత సుందరుడు
మృగమదేశ్వరుడు స్మరాంతకుడు జ్ఞానప్రదుడు
భక్తప్రేక్షణ కృత్ అంధకరిపుడు ముక్తి ధాత
సాక్షి సిద్ధరాజు భక్తవాంఛితదాయకుడు
భక్తదోష నివర్తకుడు దిగంబరుడు ఆశ్చర్యవైభవుడు
జ్ఞానసంబంధనాధుడు ఆరామప్రియుడు కామీ
శ్రీ హాలాహల సుందరుడు ఈశానుడు నిరవద్యుడు
ఆహవైశ్వర్య దాత భస్మ రుద్రాక్ష లాంచనుడు నిధిప్రదుడు
స్మర్త్యసర్వా ఘనాశకుడు శ్రీపతి శూలి
వ్యత్యాస్తన్రు త్యద్ధ్వజధృక్ శంకరుడు పశుపతి
సకాంతి స్రష్ట శంభుడు
నటనేశ్వరుడు సర్వవిఘ్నేశ్వరుడు స్వాయంభువుడు
సామప్రియుడు అనఘుడు గిరీశుడు
కలిధ్వంసి గంగాధరుడు మృడుడు
వేదమూర్తి క్రతుధ్వంసి

రమణాశ్రమం

[మార్చు]

రమణాశ్రమం అరుణాచలేశ్వరాలాయనికి 2 కి.మీ. దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి . నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

శేషాద్రి స్వామి ఆశ్రమం

[మార్చు]

రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడా ఉండటానికి వసతి గదులు ఉన్నాయి. వీటిని ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

చెన్నై నుండి దూరం

[మార్చు]
  • చెన్నై నుంచి 185 కి.మి. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు నిలయం నుండి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Thiruvannamalai city and Annamalayar Temple details including Girivalam, Pournami, Pradhosham, Karthigai Deepam". web.archive.org. 2010-04-19. Archived from the original on 2010-04-19. Retrieved 2023-03-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అరుణాచలం&oldid=4317988" నుండి వెలికితీశారు