శేషాద్రి స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేషాద్రి స్వామి
சேசாத்திரி சாமிகள்.jpg
జననంశేషాద్రి కామకోటి శాస్త్రి
(1870-01-22)1870 జనవరి 22
కాంచీపురం, తమిళనాడు
నిర్యాణము1929 జనవరి 4(1929-01-04) (వయసు 58)
తిరువణ్ణామలై, తమిళనాడు

శేషాద్రి స్వామి తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన ఆధ్యాత్మికవేత్త. ఈయన రమణ మహర్షితో చివరిదాకా ఉన్నాడు.

జీవితం[మార్చు]

శేషాద్రి స్వామి జనవరి 22, 1870 న తిరువణ్ణామలైకి సమీపంలో ఉన్న వళ్లూరు అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మరకతం, వరదరాజు. చిన్న వయసులోనే విలక్షణ ప్రతిభావంతుడిగా పేరు పొందాడు. ఈయనకు పదేళ్ళ వయసులో తల్లిదండ్రులు మరణించారు. ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి కామాక్షి దేవి ముందు కూర్చుని ముఖ పంచశతిని అనేక మార్లు చదివాడు. నారాయణోపనిషత్తు నుంచి కామోకరిషిద్ మంత్రాన్ని జపించాడు. తాను కర్మబంధాల నుంచి బయట పడాలని భక్తిలో మునిగితేలేవాడు. ఈ ధోరణి ఆయన పిన్ని, చిన్నాన్నలకు నచ్చేది కాదు. వాళ్ళు ఈయన స్వేచ్ఛను అడ్డుకునేవారు. ఆయన్ను అరుణాచలం ఆకర్షించింది. 1890 లో అరుణాచలం చేరుకున్నాడు. అలా ఇల్లు వదిలి వచ్చేసిన శేషాద్రి స్వామి 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. రమణ మహర్షి కూడా అలాగే ఇల్లు వదిలి వచ్చేసి అరుణాచలంలోనే 54 సంవత్సరాలు గడిపాడు.[1]

మరణం[మార్చు]

శేషాద్రి స్వామి జనవరి 4, 1929 న మరణించాడు. సన్యాసి సాంప్రదాయాలను అనుసరించి ఆయన శరీరాన్ని దహనం చేయకుండా ఖననం చేశారు.[2] ఆఖరి రోజుల్లో ఆయన జ్వరంతో బాధ పడ్డాడు. ఆయన భక్తులు ఆయనకు జుట్టు శుభ్రంగా కత్తిరించి, స్నానం చేయించి, మంచి బట్టలు వేసి పట్టాభిషేకం చేసి ఫోటో తీయాలని కోరుకున్నారు. ఆయన తనకు జ్వరం వస్తుందని చెప్పి మొదట్లో అంగీకరించకపోయినా తర్వాత భక్తుల కోరిక మేరకు సరేనన్నాడు. కొన్ని నెలల మందు ఆయన ఒక భక్తుడితో తాను ఒక కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి వెళితే ఎలా ఉంటుందని మార్మికంగా తన మరణాన్ని ఉద్దేశించి మాట్లాడాడు.[3]

ఆయన పట్టాభిషేకం జరిగిన మరుసటి రోజే జ్వరం బారిన పడ్డాడు. అయినా సరే ఊరులో తిరగడం మాత్రం మానలేదు. దాంతో ఆయన శరీరం శుష్కించి పోయింది. చివరగా ఒక ఇంటి వీధి వైపు వరండా వైపు వచ్చి అక్కడే మహా సమాధి పొందాడు.

రమణ మహర్షి ఈయనకన్నా 10 ఏళ్ళు చిన్నవాడు. శేషాద్రి స్వామి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు రమణ మహర్షి మౌనం వహిస్తూ అక్కడే ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. మాస్టర్ శార్వరి (2015). సద్గురు రమణ. సికిందరాబాదు: శార్వరి ధ్యానక్షేత్రం. p. 43.
  2. Ramana Maharshi and the Path of Self-Knowledge
  3. "Ebook # 47 -Sri Kamakoti Seshadri Swamigal - Special Edition | Kanchi Periva Forum".