గల్ఫ్ (సినిమా)
గల్ఫ్ (2017 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సునీల్ కుమార్ రెడ్డి |
---|---|
నిర్మాణం | యక్కలి రవీంద్రబాబు |
తారాగణం | చేతన్ మద్దినేని, డింపుల్ హయాతి, భద్రం, నాగినీడు, జీవా |
సంగీతం | ప్రవీణ్ ఇమ్మడి |
గీతరచన | మాష్టార్జీ |
సంభాషణలు | పులగం చిన్నారాయణ |
నిర్మాణ సంస్థ | శ్రావ్య ఫిలిమ్స్ |
భాష | తెలుగు |
గల్ఫ్ పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తెలుగు సినిమా. ఈ సినిమా 2017 అక్టోబర్ 13న విడుదలయ్యింది.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]- శివ - చేతన్ మద్దినేని
- లక్ష్మి - డింపుల్ హయాతి
- బంగార్రాజు - భద్రం
- నవీన్ - మిప్పు
- సుబ్రమణి - సుబ్రమణి
- సోములు - నల్ల వేణు
- రాజయ్య - నాగినీడు
- బాలరాజు - జీవా
- మంగారెడ్డి - పోసాని కృష్ణమురళి
- సూఫీ గాయకుడు - తనికెళ్ళ భరణి
- కరుణక్క - సన
- చంద్రం - ప్రభాస్ శ్రీను
- - సంతోష్ పవన్
- - తోటపల్లి మధు
- - బిత్తిరి సత్తి
- - సోనం
- - పింగ్ పాంగ్ సూర్య
- - సాయి అనిల్ కళ్యాణ్
- - రాజ్యలక్ష్మి
- - తీర్థ
- - డిగ్గీ
- - మహేష్
- - ఎఫ్ ఎం బాబాయ్
- - పూజిత
- - సూర్య
- - శివ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి
- సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
- మాటలు: పులగం చిన్నారాయణ
- నిర్మాత: యక్కలి రవీంద్రబాబు
కథ
[మార్చు]ఉపాధి కోసం ప్రతీ ఏటా సొంత ఊరును వదిలి వలస వెళ్లే వందలాది సిరిసిల్ల చేనేత కార్మికుల్లో ఒకడిగా శివ (చేతన్ మద్దినేని) గల్ఫ్‌కు వెళ్తాడు. విమాన ప్రయాణంలో గల్ఫ్‌కు వెళ్తున్న మరో అమ్మాయి లక్ష్మి (డింపుల్) పరిచయం అవుతున్నది. తొలిచూపులోనే వారి మధ్య ఓ ఆకర్షణ పుడుతుంది. ఆ ఆకర్షణ ఇష్టంగా మారి ఆ తర్వాత ప్రేమగా బలపడుతుంది. గల్ఫ్‌లో పనిచేస్తుండగా ఈ ప్రేమ జంటకు పలు కష్టాలు ఎదురవుతాయి. లక్ష్మీపై శారీరక దాడులు ఎక్కువైతాయి. లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. జీవితం బాగుపడాలని పెట్టుకొన్న ఎన్నో ఆశలు కన్నీళ్లలో కరిగిపోతాయి. డబ్బు సంపాదించి కుటుంబాన్ని అప్పుల బాధను గట్టెక్కించాలనుకొన్న శివ గల్ఫ్‌లో మోసానికి గురవుతాడు. ఇలా గల్ఫ్‌లో జరుగుతున్న అన్యాయాలు, కష్టాల్లో ఉన్న బాధితుడిగా శివ మిగిలిపోతాడు. గల్ప్‌లో ఉపాధి ఓ డొల్ల అని తెలుసుకొన్న ఆయా పాత్రలు అక్కడి నుంచి తప్పించుకొని ఎలా స్వదేశానికి చేరుకొన్నారు అనేది ఈ చిత్ర ముగింపు.[1]
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలకు ప్రవీణ్ ఇమ్మడి సంగీత దర్శకత్వం వహించాడు.
క్ర.సం. | పాట | రచన | గాయకులు |
---|---|---|---|
1 | ఆశల రెక్కలు కట్టుకొని పొట్టను చేతిలో పట్టుకొని వలసల బాటలో కాసుల వేటలో దేశం దాటిన నీకు సలామ్ | కాసర్ల శ్యామ్ | అంజనా సౌమ్య |
2 | ఎదురే పడుతుంటే ఎదనే తడుతుంటే ఇదిగా ఉంటోంది ఇది ప్రేమేనా | గీతామాధురి, దీపు | |
3 | మేరే అల్లా.. మేరె మౌలా.. కడతాను నిలువెల్లా నా కనులు వీడని కలల గుడిని ఎదనెల్లా [3] | మాష్టార్జీ | కె.ఎం.రాధాకృష్ణన్, హైమత్, మోహన భోగరాజు |
4 | నేనెల్లిపోతా దుబాయ్‌కి నేను సెయ్యలేను లడాయిని నేనెల్లిపోతా దుబాయ్‌కి నేనైపోతా నవాబుని | సునీల్ & ప్రవీణ్ | ధనుంజయ్, లిప్సిక |
5 | అరబిక్ గీతం | అహ్మద్ | అహ్మద్ |
మూలాలు
[మార్చు]- ↑ రాజబాబు. "గల్ఫ్ మూవీ రివ్యూ: వలస కార్మికుల వెతలు, జీవిత సత్యాలు". ఫిల్మీబీట్. Retrieved 12 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "GULF (2017) SONGS". MovieGQ. Retrieved 12 February 2022.
- ↑ తిరునగరి శరత్ చంద్ర (30 May 2021). "పాటల మాష్టార్జీ". నమస్తే తెలంగాణ. Archived from the original on 9 ఫిబ్రవరి 2022. Retrieved 12 February 2022.