యక్కలి రవీంద్రబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యక్కలి రవీంద్రబాబు
జననం
మార్కాపురం, ప్రకాశం జిల్లా
మరణం2023 నవంబరు 11
జాతీయతభారతీయుడు
వృత్తిసినిమా నిర్మాత, గీత రచయిత

యక్కలి రవీంద్రబాబు తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత. ఆయన శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు.

పలు పురస్కారాలు అందుకున్న ఆయన తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా సినిమాలు నిర్మించాడు. ఆయన మొత్తం 17 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పలు పురస్కారాలు అందుకున్న సొంతూరు, గంగపుత్రులు వంటి చిత్రాలు నిర్మించి ఆయన ప్రసిద్దిచెందాడు.[1]

ఆయన గీత రచయితగా కూడా హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ లాంటి పలు చిత్రాలకు సాహిత్యం అందించాడు.

జీవిత చరిత్ర[మార్చు]

ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జన్మించిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఆ తరువాత, ఆయన ఛార్టర్డ్ ఇంజనీర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. కానీ, ఆయనకు సినిమాపై ఉన్న ఆసక్తితో తెలుగు సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.

ఆయన 25 ఏళ్ల కెరీర్ లో మా నాన్న నక్సలైట్ (2022), వెయిటింగ్ ఫర్ యూ, సొంతూరు (2009), గల్ఫ్ (2017), గంగపుత్రులు (2011), హనీట్రాప్ (2021) వంటి అవార్డు విన్నింగ్, విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 55 సంవత్సరాల వయసులో 2023 నవంబరు 11న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.[2] ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఆశ్రీత (కుమార్తె) , సాయి ప్రభాస్ (కుమారుడు) ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత! | Producer Yakkali Ravindra Babu Passes Away - Sakshi". web.archive.org. 2023-11-12. Archived from the original on 2023-11-12. Retrieved 2023-11-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Ravindra Babu Yakkali: నిర్మాత యక్కలి రవీంద్రబాబు కన్నుమూత | ravindra babu yakkali passed away". web.archive.org. 2023-11-12. Archived from the original on 2023-11-12. Retrieved 2023-11-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)