లవ్ యు బంగారమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవ్ యు బంగారమ్
దర్శకత్వంగోవర్థన్ రెడ్డి
నిర్మాతకె. వల్లభ & మారుతి దాసరి
నటవర్గంరాహుల్ హరిదాస్
శ్రావ్య
రాజీవ్
ఛాయాగ్రహణంగోపినాథ్
సంగీతంమహిత్ నారాయణ్
నిర్మాణ
సంస్థలు
క్రియుటీవ్ కమర్షియల్
మారుతి టాకీస్
పంపిణీదారులుమారుతి మూవీస్
విడుదల తేదీలు
2014 జనవరి 24 (2014-01-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

లవ్ యు బంగారమ్ 2014, జనవరి 24న విడుదలయిన తెలుగు చలనచిత్రం. క్రియుటీవ్ కమర్షియల్, మారుతి టాకీస్ పతాకాలపై కె. వల్లభ, మారుతి దాసరి నిర్మాణ సారథ్యంలో గోవర్థన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ హరిదాస్, శ్రావ్య, రాజీవ్ నటించగా, చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం అందించాడు.[1][2][3]

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

ఆకాష్ (రాహుల్) సెల్ కాన్ మొబైల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఆకాష్ చూడటానికి ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించినా కాస్త ఆత్మ నూన్యత భావం (ఇన్సెక్యూర్ ఫీలింగ్) కలిగిన వ్యక్తి. ఆకాష్ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన ఆలోచనలు ఉన్న అమ్మాయి మీనాక్షి (శ్రావ్య). ఆకాష్ మీనాక్షిని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి మీనాక్షి కూడా రాహుల్ ని ప్రేమిస్తుంది. వీరిద్దరి ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించకపోవడంతో పెద్దవాళ్ళని కాదని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత సాఫీగా సాగిపోతున్న వారిద్దరి జీవితంలోకి మదన్ (రాజీవ్) ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత రాహుల్ – మీనాక్షి మధ్య ఏం జరిగింది? వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలు ఏంటి? అసలు ఈ మదన్ ఎవడు? అనేది సినిమా క్లైమాక్స్.[4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: గోవర్థన్ రెడ్డి
  • నిర్మాత: కె. వల్లభ & మారుతి దాసరి
  • సంగీతం: మహిత్ నారాయణ్
  • ఛాయాగ్రహణం: గోపినాథ్
  • నిర్మాణ సంస్థ: క్రియుటీవ్ కమర్షియల్, మారుతి టాకీస్
  • పంపిణీదారు: మారుతి మూవీస్

పాటలు[మార్చు]

లవ్ యు బంగారమ్
పాటలు
విడుదలనవంబరు 2013
రికార్డింగు2013
సంగీత ప్రక్రియవరల్డ్ మ్యూజిక్
రికార్డింగ్ లేబుల్శ్రేయాస్ మ్యూజిక్
నిర్మాతమహిత్ నారాయణ్

ఈ చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు. 2013, నవంబరులో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. సినిమా విడుదలకు ముందే పాటలు విజయవంతమయ్యాయి.

పాట పేరు గాయకులు నిడివి గీత రచయిత
జై శంభో శంభో టిప్పు, మిర్చి అజయ్, ధరణి 04:07 కాసర్ల శ్యామ్‌
రెండు కళ్ళు సాలవట రేవంత్, సుధీక్ష 04:38 కందికొండ యాదగిరి
విరిసిన కలువలు హరి 02:41 మహిత్
నువ్వే నాతో శ్రీరామచంద్ర, శ్రావణ భార్గవి 04:17 మహిత్, గోవి
ఆజా నాచలే భార్గవి పిళ్ళై 02:24 రామ్ పిడిసెట్టి
అణువణువున చెలియా వాసు 04:19 కాసర్ల శ్యామ్

మూలాలు[మార్చు]

  1. Never thought I'd have to struggle so much: Rahul Haridas | Business Standard
  2. Rahul Haridas of Happy Days Fame Still Feels Like a Newcomer - The New Indian Express
  3. http://www.filmibeat.com/telugu/movies/love-you-bangaram/photos.html
  4. "Love You Bangaram Telugu Movie Review". Venditera.in. Retrieved 2020-09-26.

బయటి లింకులు[మార్చు]