ధరణి (దర్శకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధరణి
జననం
విసి రమణి
వృత్తిసినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత
క్రియాశీల సంవత్సరాలు1999-2011

ధరణి (విసి రమణి), దక్షిణ భారత చిత్ర దర్శకుడు. ఇతడు ప్రధానంగా యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1][2] తమిళంలో సూపర్ హిట్ యాక్షన్ చిత్రాలైన ధిల్, ధూల్, ఘిల్లి మొదలైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

సినిమారంగం[మార్చు]

ఫారెస్ట్ బ్రిగేండ్ వీరప్పన్, అతని తమ్ముడి మరణం ఆధారంగా రూపొందిన ఎతిరుమ్ పుదిరం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో మమ్ముట్టి నటించాడు. 1999లో ఏర్పడిన రాజకీయ వివాదాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా విడుదలయింది. ఇది విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతోపాటు, రెండవ ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది. ఈ చిత్ర నిర్మాత పూర్ణచంద్రరావు ధరణి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా, ధిల్ సినిమా నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. 2003లో ఎ.ఎం. రత్నం నిర్మాణంలో విక్రమ్, జ్యోతిక, రీమాసేన్ లతో ధరణి తీసిన ధూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తరువాత ఎ.ఎం.రత్నం నిర్మాతగా విజయ్, త్రిష నటించిన ఘిల్లి సినిమాకు దర్శకత్వం వహించాడు.[3] దీని తరువాత తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో బంగారం సినిమా తీశాడు.

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా
సంవత్సరం సినిమా విభాగం ఇతర వివరాలు
దర్శకుడు రచయిత
1999 ఎతిరం పుదిరం Green tickY Green tickY ఉత్తమ మూడవ ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
2001 ధిల్ Green tickY Green tickY
2003 ధూల్ Green tickY Green tickY
2004 ఘిల్లి Green tickY Green tickY
2006 బంగారం Green tickY Green tickY తెలుగు చిత్రం
2008 కురువి Green tickY Green tickY
2011 ఒస్తే Green tickY Green tickY
గాయకుడిగా
  • "తారుమారు" (ఉచతుల శివ)

మూలాలు[మార్చు]

  1. "Dharani is back". Behindwoods. Archived from the original on 19 July 2012. Retrieved 2 April 2021.
  2. Sreedhar Pillai 9 May 2011, 12.00am IST (2011-05-09). "Dharani: Back with Da'bang'G - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2012-07-07. Retrieved 2 April 2021.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Welcome to". Sify.com. 2007-01-20. Archived from the original on 2018-07-20. Retrieved 2 April 2021.

బయటి లింకులు[మార్చు]