Jump to content

అనుక్షణం

వికీపీడియా నుండి
అనుక్షణం [1]
అమ్మాయిలూ జాగ్రత్త!
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
నిర్మాతమంచు విష్ణు
తారాగణం
  • విష్ణు మంచు
  • రేవతి
  • బ్రహ్మానందం
  • నవదీప్
  • తేజస్వి మదివాడ
  • మధుశాలిని
నిర్మాణ
సంస్థ
24 ఫ్రేమ్స్ ఫాక్టరి
విడుదల తేదీ
సెప్టెంబరు 12, 2014 (2014-09-12)
దేశంభారత్
భాషతెలుగు

అనుక్షణం 2014 సెప్టెంబరు 12న విడుదలైన తెలుగు చిత్రం.

సీతారాం (సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి? వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్‌లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ వ్యక్తం చేయడానికి లైటింగ్‌ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను సమంవయం చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు కొత్తగా ఉంది. ఇలాంటి అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి.

దర్శకుడి పనితీరు:

[మార్చు]

ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్ఫూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారు. సీరియల్ కిల్లర్ ప్రవర్తను చిత్రంలో చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో ప్రసార మాధ్యమాల తీరును తన తీరులో తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే సాంకేతిక అంశాలను తన కావాల్సిన తీరులో వినియోగించుకున్నారు. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. సాంకేతిక అంశాలతో నింపడంలో చేశాడంలో వర్మ సఫలమయారు. ఇతని గత చిత్రాల కన్నా ఈ చిత్రం పూర్తి భిన్నంగా రూపొందించబడింది.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Anukshanam Movie Review http://www.aptoday.com/moviereviews/review-anukshanam/53/ Archived 2014-09-13 at the Wayback Machine
  2. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అనుక్షణం&oldid=3850565" నుండి వెలికితీశారు