మధు శాలిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధు శాలిని
Madhu Shalini at Bhoot Returns promotion.jpg
భూత్ రిటర్న్స్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మధు శాలిని
జననంహైదరాబాదు, తెలంగాణా
వృత్తినటి, మోడల్, వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు2006-ప్రస్తుతం

మధు శాలిని ఒక సినీ నటి, వ్యాఖ్యాత, మోడల్. తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మధు శాలిని హైదరాబాదులో జన్మించింది. ఆమె తండ్రి హమీద్ వ్యాపారవేత్త. తల్లి రాజ్ కుమారి ఒక న్యాయవాది, శాస్త్రీయ నర్తకి.[1] ఆమె కూడా తల్లి లాగే కూచిపూడి నృత్యం నేర్చుకుంది. తర్వాత ఓ అందాల పోటీల్లో పాల్గొని అందులో గెలుపొందడంతో తన మోడలింగ్ కెరీర్ ప్రారంభించింది.

కెరీర్[మార్చు]

కొద్ది రోజులు టీవీ లో వ్యాఖ్యాతగా పనిచేసిన తర్వాత సినిమాల్లో నటిగా మారింది.[2]

2006 లో ఈ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు సినిమాతో నటిగా తన కెరీర్ ప్రారంభించింది.[3] అదే సంవత్సరంలో తేజ రూపొందించిన ఒక విచిత్రం, అగంతకుడు సినిమాల్లో నటించింది,[4]. 2007 లో వచ్చిన స్టేట్ రౌడీ అనే ఒక తమిళ రీమేక్ చిత్రంలో నటించింది.[5] తర్వాత కొద్ది రోజులకు లో బడ్జెట్ చిత్రమైన పళనియప్ప కల్లూరి అనే సినిమాతో తమిళ సినీ రంగంలోకి కూడా ప్రవేశించింది.

సినివారంలో మధుశాలినీ

తర్వాత ఆమె డి. సభాపతి దర్శకత్వంలో హ్యాపీ జర్నీ అనే చిత్రానికి ఎంపికైంది. అదే దర్శకుడు తీయబోయే పతినారు అనే తమిళ సినిమాకు కూడా ఎంపికైంది.[6]. పతినారు సినిమాకు మిశ్రమ స్పందనలు లభించినా మధుశాలిని నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.[7][8][9] ఆమె తరువాతి సినిమా కారాలు మిరియాలు కు సరైన స్పందన రాలేదు కానీ ఆమె నటన పర్వాలేదనిపించింది.[10] ఒక సమీక్షకుడు ఆమె అందంగా ఉండి, మంచి నటన కనబరిచినా ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదంటూ వ్యాఖ్యానించాడు.[11] తరువాత ఆమె జాతీయ పురస్కార గ్రహీతయైనా బాల దర్శకత్వంలో అవన్ ఇవన్ అనే సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపు పొందింది.[6] ఈ చిత్రానికి దర్శకుడు పలువురు నటీమణులను ఆడిషన్ చేసినా ఆయనకు తృప్తి కలగకపోవడంతో మధుశాలినిని ఆడిషన్ లేకుండానే ఎంపిక చేశాడు. ఆమె ఇందులో ఓ కాలేజీ విద్యార్థిని పాత్రలో మేకప్ లేకుండా నటించింది. తొలిసారిగా తమిళంలో తన డబ్బింగ్ చెప్పుకుంది.[12]

బాలీవుడ్ లో ఆమె మొదటి సినిమా రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డిపార్ట్ మెంట్. ఈ సినిమాలో ఆమె అమితాబ్ బచ్చన్, సజయ్ దత్, రాణా దగ్గుబాటి సరసన నటించింది.[13] తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన భూత్ రిటర్న్స్ అనే హారర్ సినిమాలో, మరో రెండు సంవత్సరాల తర్వాత అనుక్షణం అనే థ్రిల్లర్ సినిమాల్లో నటించింది. 2015 లో వచ్చిన గోపాల గోపాల సినిమాలో ఆమె ఓ రిపోర్టరుగా నటించింది. తమిళ సినిమా తూంగవనం లో నర్సుగా[14] సీతావలోకనం సినిమాలో సీత గా నటించింది.[15]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2005 అందరివాడు తెలుగు
నా ప్రాణం కంటే ఎక్కువ చంద్రిక తెలుగు [1]
నాయకుడు తెలుగు అతిథి పాత్ర[16]
2006 కితకితలు రంభ తెలుగు [17]
ఒక వి చిత్రం తెలుగు [17]
అగంతకుడు చిత్ర తెలుగు
2007 స్టేట్ రౌడీ విమల శర్మ తెలుగు
పళనియప్పన్ కల్లూరి మల్లి తమిళం [17]
2008 కింగ్ తెలుగు
2011 పతినారు ఇందు తమిళం
కారాలు మిరియాలు శ్రేయ అరవింద్ తెలుగు
అవన్ ఇవన్ తెన్మొళి తమిళం
2012 డిపార్ట్ మెంట్ నసీర్ హిందీ
నాగవల్లి రాజేశ్వరి కన్నడం
భూత్ రిటర్స్స్ పూజ హిందీ
2014 బ్రామ్మన్ ఆమెగానే తమిళం ప్రత్యేక పాత్ర
2014 అనుక్షణం ఆషా తెలుగు
2014 పొగ తెలుగు
2015 గోపాల గోపాల టీవీ రిపోర్టరు తెలుగు
2015 తూంగ వనం

చీకటి రాజ్యం

ఎస్తర్ తమిళం
తెలుగు
2015 సీతావలోకనం సీత తెలుగు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Madhu Shalini talks about Films >> Tollywood Star Interviews". Ragalahari.com. 13 June 2006. Retrieved 21 October 2011.
  2. "Naa Pranamkante Ekkuva – audio function – Telugu Cinema – Dr. Nirajj & Madhu Shalini – Sashi Preetam". Idlebrain.com. Retrieved 21 October 2011.
  3. "Friday Review Hyderabad / On Location : Comedy with a message". The Hindu. India. 9 March 2007. Retrieved 21 October 2011.
  4. [1] Archived 11 ఆగస్టు 2010 at the Wayback Machine
  5. "State Rowdy Review – Telugu Movie Review by Kishore". Nowrunning.com. 9 December 2007. Retrieved 21 October 2011.
  6. 6.0 6.1 "It's talent that matters: Madhu". Times Of India. 29 January 2011. Retrieved 21 October 2011.
  7. "Pathinaru Tamil Movie Review – cinema preview stills gallery trailer video clips showtimes". IndiaGlitz. 28 January 2011. Retrieved 21 October 2011.
  8. "Pathinaaru Movie Review – Tamil Movie Pathinaaru Movie Review". Behindwoods.com. Retrieved 21 October 2011.
  9. "Review: Pathinaru is average – Rediff.com Movies". Rediff.com. 28 January 2011. Retrieved 21 October 2011.
  10. "Karalu Miriyalu Review - Karalu Miriyalu Movie Review on fullhyd.com". Fullhyderabad.com. Retrieved 21 October 2011.
  11. "Karalu Miriyalu Review | Karalu Miriyalu Movie Review | Navkesh | Madhu Shalini – Sunita's Reviews". CineGoer.com. 19 March 2011. Archived from the original on 11 November 2011. Retrieved 21 October 2011.
  12. "Madhu Shalini - Tamil Cinema Actress Interview - Madhu Shalini | Bala | Vishal | Avan Ivan | Arya". Videos.behindwoods.com. Retrieved 21 October 2011.
  13. "Madhu Shalini turns gangster". Times Of India. 26 August 2011. Retrieved 21 October 2011.
  14. http://www.deccanchronicle.com/140905/entertainment-tollywood/article/madhu-plays-lead-her-next
  15. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Madhu-Shalini-to-be-seen-as-Seetha/articleshow/43421258.cms
  16. "Telugu cinema news". idlebrain.com. Retrieved 21 October 2011.
  17. 17.0 17.1 17.2 "Madhu Shalini in Kannada – Kannada Movie News". IndiaGlitz. Retrieved 21 October 2011.

బయటి లింకులు[మార్చు]