గోకుల్ ఆనంద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోకుల్ ఆనంద్
వృత్తినటుడు
జీవిత భాగస్వామిమధు షాలిని[1]

గోకుల్ ఆనంద్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన బాల్య నటుడిగా పలు మలయాళం టెలివిషన్ షోలలో పాల్గొన్ని 2015లో మలై నేరతు మయక్కమ్ సినిమా ద్వారా నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2]

వివాహం

[మార్చు]

గోకుల్‌ ఆనంద్‌ తెలుగు సినిమా నటి మధుశాలిని 2022 జూన్ 16న హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌లో వివాహమాడాడు.[3]

సినీ జీవితం

[మార్చు]

గోకుల్ ఆనంద్ మళయాలంలో బాలనటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, 14 ఏళ్ల వయసులో రామాయణం తమిళ వెర్షన్ కి సంబంధించిన నాటకంలో నటించాడు. ఆనంద్. ఆ తర్వాత రెండేళ్లకు 'ఏవం' అనే ఫేమస్ థియేటర్ గ్రూప్ లో చేరి రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నాడు. ఆయన 2008లో చెన్నైలో 'The Boardwalkers' అనే థియేటర్ కంపెనీతో కలిసి పని చేసి నటనపై ఆసక్తితో బీఏలో యాక్టింగ్ కోర్స్ చేశాడు.

గోకుల్ ఆనంద్ ఆ తరువాత 'చెన్నై టు సింగపూర్', 'పంచాక్షరం', 'తిట్టమ్ ఇరండు', 'నడువన్' వంటి సినిమాల్లో నటనకు గాను మంచి గుర్తింపునందుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష
2015 మలై నేరతు మయక్కమ్ మానస్ తమిళం
2017 చెన్నై 2 సింగపూర్ హరీష్ తమిళం
2019 పంచరక్షరం ఐధాన్ తమిళం
2020 తీవీరం తమిళం
2021 తిట్టం ఇరందు కిషోర్ తమిళం
2021 నడువాన్ శివుడు తమిళం
2022 జాక్ ఎన్ జిల్ జోసెఫ్ మలయాళం

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సిరీస్ పాత్ర భాష ఇతర విషయాలు
2018 అమెరికా మాప్పిళ్ళై కార్తీక్ తమిళం జీ5
డోర్ నెం. 403 సాగా తమిళం
2020 టాప్ లెస్ నేరుగా తమిళం జీ5

మూలాలు

[మార్చు]
  1. "Madhu Shalini ties the knot with Gokul Anand" (in ఇంగ్లీష్). 17 June 2022. Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  2. "You don't learn if you are not rejected: Gokul Anand" (in ఇంగ్లీష్). 16 January 2017. Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  3. Andhra Jyothy (17 June 2022). "తమిళ నటుడిని పెళ్లాడిన మధుశాలిని!" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.

బయటి లింకులు

[మార్చు]