వెన్నెల కిశోర్

వికీపీడియా నుండి
(వెన్నెల కిషోర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెన్నెల కిశోర్
జననం
విద్యజీవన్ హైస్కూల్, కామారెడ్డి
వృత్తిసాఫ్ట్‌వేర్ టెస్టర్ ,
నటుడు,
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2005 - ఇప్పటి వరకు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు
గుర్తించదగిన సేవలు
వెన్నెల (సినిమా)
ఇంకోస్సారి
బిందాస్
ఏమైంది ఈవేళ
జీవిత భాగస్వామిపద్మజ
తల్లిదండ్రులులక్ష్మీ నారాయణ (తండ్రి)
పురస్కారాలు2009 : నంది ఉత్తమ హాస్యనటుడు - ఇంకోసారి

'వెన్నెల కిశోర్' ఒక తెలుగు సినీ నటుడు, దర్శకుడు. పూర్వాశ్రమంలో ఇతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

కిశోర్ వాళ్ళది నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో ఓ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లక్ష్మీ నారాయణ ఆంగ్ల ఉపాధ్యాయుడు. కిశోర్ కు నలుగురు అక్కలు. తనకి ఊహ తెలిసేటప్పటికే అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దక్క పిల్లలదీ తనదీ దాదాపు ఒకే వయసు. కిషోర్ ఏడో తరగతిలో ఉండగానే తండ్రి పదవీ విరమణ చేశాడు. చిన్నప్పుడు ఇంట్లో నాన్న దగ్గరే పాఠాలు అభ్యసించాడు. కామారెడ్డి పాఠశాలలో పదో తరగతి దాకా చదువుకున్నాడు. ఇంటర్ చదవడానికి హైదరాబాదుకు వచ్చాడు. మొదట్లో ఎంపిసిలో చేరి అది నచ్చక మళ్ళీ బైపీసీలో చేరి. చివరికి డిగ్రీకి వచ్చే సరికి బీకాంకు మారాడు. హైదరాబాదుకు వచ్చినప్పటి నుంచీ తరచు సినిమాలు చూడటం అలవాటైంది. డిగ్రీ పూర్తయిన తరువాత ఏడాదిన్నర పాటు ఓ కోర్సులో చేరాడు. ఆ కోర్సు వల్ల అమెరికా, ఆస్ట్రేలియాల్లోని రెండు విద్యాసంస్థల్లో దాదాపు ప్రవేశం ఖరారైంది. జీఆర్ఈ, టోఫెల్ లో కూడా మంచి స్కోరు సంపాదించాడు. అమెరికాలోని మాస్టర్స్ చదవడానికి ఓ విశ్వవిద్యాలయంలో ఓ సీటు కూడా దొరికింది.

ఉద్యోగం[మార్చు]

మాస్టర్స్ పూర్తవగానే వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌వేర్ టెస్టర్ గా ఉద్యోగం దొరికింది. అక్కడ ఉన్నప్పుడే వెన్నెల (2005) సినిమాకు దర్శకుడు దేవ కట్టా దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. ఆ సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివారెడ్డికి వీసా కుదరకపోవడంతో ఆ పాత్రలో కిశోర్ నటించాల్సి వచ్చింది. అలా మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. వర్జీనియాలో ఎన్నారైలకు నెల జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు. ఆ సెలవును వాడుకుని ఈ సినిమాకు పనిచేశాడు. తరువాత చిరంజీవి నటించిన సినిమా స్టాలిన్ సినిమాలో అవకాశం వచ్చినా సెలవు దొరక్క అందులోంచి తప్పుకున్నాడు.

నట జీవితము[మార్చు]

వెన్నెల సినిమా విడుదలయ్యాక మూడేళ్ళు సినిమా ఊసే ఎత్తలేదు. అప్పుడే పెళ్ళి కూడా చేసుకున్నాడు. భార్య పద్మజ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. కిశోర్ అమ్మ సలహా మేరకు ఇద్దరూ భారత్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులన్నీ తీర్చుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. కిశోర్ ముంబైలోని జెపి మోర్గాన్ లో, భార్య పద్మజకు హైదరాబాదులో మంచి ఉద్యాగాలు దొరికాయి. ఇక్కడికి రాగానే మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో జెపి మోర్గాన్ లో చేరడాని మరో ఆరు నెలలు గడువు తీసుకుని పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు.[2]

జీఆర్8 ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై చైతన్య కృష్ణ, మొనాల్ గజ్జర్ జంటగా వెన్నెల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన 'వెన్నెల 1 1/2' చిత్రం దారుణమైన పరాజయం తర్వాత ఇక ఆ వెన్నెలను తన పేరు నుంచి తొలగించారు. ఇప్పుడు కిశోర్ గా మారాడు.

నటుడిగా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2005 వెన్నెల (సినిమా) ఖాదర్ తెలుగు
2009 ఇందుమతి తెలుగు
సమర్ధుడు తెలుగు
కరెంట్ తెలుగు
2010 బిందాస్ ముద్దుకృష్ణ తెలుగు
చక్రి తెలుగు
ఇంకోసారి తెలుగు నంది ఉత్తమ హాస్యనటుడు
ప్రస్థానం తెలుగు
స్నేహగీతం తెలుగు
ఆరెంజ్ (సినిమా) తెలుగు
ఏమైంది ఈవేళ తెలుగు
వారెవ్వా తెలుగు
తిమ్మరాజు తెలుగు
2011 అహ! నా పెళ్ళంట! (2011) లవ్ గురు తెలుగు
సీమ టపాకాయ్i పెద కిశోర్ తెలుగు
దూకుడు (సినిమా) శాస్త్రి తెలుగు
మడతకాజా తెలుగు
ఇట్స్ మై లవ్ స్టోరీ సుజాత్ తెలుగు
పిల్ల జమీందార్ తెలుగు
2012 శివ మనసులో శృతి తెలుగు
మిస్టర్ నూకయ్య తెలుగు
లవ్‌లీ తెలుగు
దరువు తెలుగు
జులాయి తెలుగు
2013 జబర్దస్త్ తెలుగు
అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్[3] తెలుగు
D/O వర్మ తెలుగు
2014 అలా ఎలా? తెలుగు
లక్ష్మీ రావే మా ఇంటికి[4] తెలుగు
బూచమ్మ బూచోడు[5] తెలుగు
ప్యార్ మే పడిపోయానే తెలుగు
బాయ్ మీట్స్ గర్ల్ (తొలిప్రేమ కథ) తెలుగు
2015 జెండాపై కపిరాజు[6] తెలుగు
2016 నాన్నకు ప్రేమతో తెలుగు
బాబు బంగారం[7] తెలుగు
ఆటాడుకుందాం రా తెలుగు
ఎలుకా మజాకా తెలుగు
మనమంతా తెలుగు
జనతా గ్యారేజ్ తెలుగు
ఎల్7 తెలుగు
సుప్రీమ్ కానిస్టేబుల్ కిషోర్ తెలుగు
2017 నేను లోకల్ కానిస్టేబుల్ తెలుగు
వీడెవడు
2018 ఛలో తెలుగు
దేవదాస్[8] డా. కూచిపూడి తెలుగు
జంబలకిడిపంబ (2018 సినిమా) తెలుగు
అమర్ అక్బర్ ఆంటోని తెలుగు
శైలజారెడ్డి అల్లుడు చారి తెలుగు
నా నువ్వే తెలుగు
2019 "కౌసల్య కృష్ణమూర్తి"[9] తెలుగు
ఇన్స్పెక్టర్ బలరాం తెలుగు
అర్జున్ సురవరం
మత్తు వదలరా
ఏదైనా జరగొచ్చు
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
కథనం తెలుగు
తోలుబొమ్మలాట తెలుగు
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ తెలుగు
2020 "ఎంత మంచివాడవురా!"[10][11] తెలుగు
డిస్కో రాజా[12][13] తెలుగు
భీష్మ తెలుగు
సోలో బ్రతుకే సో బెటర్ తెలుగు
2021 బంగారు బుల్లోడు తెలుగు
కపటధారి తెలుగు
రంగ్ దే తెలుగు
ఇచ్చట వాహనములు నిలుపరాదు తెలుగు
2022 బంగార్రాజు
హీరో
అఖిల్
ఖిలాడీ బాబీ
మళ్ళీ మొదలైంది కిశోరె
సన్ ఆఫ్ ఇండియా
ఆడవాళ్లు మీకు జోహార్లు ఫణి
స్టాండప్‌ రాహుల్‌ స్టీవ్ జాగ్స్
ఎఫ్ 3 జూనియర్ ఆర్టిస్ట్
అశోకవనంలో అర్జున కల్యాణం ఎమ్మెల్యే రాజారాం
ఆచార్య
సర్కారు వారి పాట కిశోరె
బింబిసారా ప్రసాదం
హ్యాపీ బర్త్‌డే కేంద్ర మంత్రి రిత్విక్ సోది
సీతా రామం దుర్జోయ్ శర్మ
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి బోస్
ఒకే ఒక జీవితం శీను (ది బ్రోకర్)
స్వాతిముత్యం డా. బూచి బాబు
కృష్ణ వ్రింద విహారి డా. సత్య
జిన్నా మైసూర్ బుజ్జి
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఇంగ్లీష్ టీచర్
ఊర్వశివో రాక్షసివో సతీష్
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం గురు
గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు
వాంటెడ్ పండుగాడ్
ఫస్ట్ డే ఫస్ట్ షో
2023 వాల్తేరు వీరయ్య సీతాపతి బావమరిది
మిస్టర్. కింగ్ ఉమాదేవి కాబోయే భర్త
సత్తిగాని రెండు ఎకరాలు బైక్ రైడర్
రామబాణం సావిత్రి
కస్టడీ ప్రేమ్
భువన విజయమ్ మ్యూట్ రైటర్
అన్నీ మంచి శకునములే ప్రసాద్ అల్లుడు
సామజవరగమన కుల శేఖర్
బ్రో మార్క్ యజమాని
మిస్టర్ కింగ్
భోళా శంకర్ వంశీ (బాంసి)
నేనే నా బొబ్బిలి రాజా
ఖుషి పితోబాష్
రూల్స్ రంజన్ కామేష్
ప్రేమ విమానం [14]
బ్రీత్
2024 హను మాన్ తెలుగు
గుంటూరు కారం బాలు తెలుగు
ఊరు పేరు భైరవకోన తెలుగు
ఆ ఒక్కటి అడక్కు తెలుగు
ఇండియన్ 2 తమిళ్

దర్శకుడు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (3 March 2024). "కామెడీ చాలా సీరియస్‌ విషయం". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  2. ఈనాడు ఆదివారం సంచిక, అక్టోబరు 25, 2015, పేజీ. 12
  3. Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
  4. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
  6. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  7. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  8. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  9. ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌస‌ల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 August 2019. Retrieved 10 January 2020.
  10. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  11. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  12. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 25 January 2020. Retrieved 24 January 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help)
  13. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.
  14. "Finally! Delayed Telugu Film 'Prema Vimanam' OTT Release Date Out". binged.com. Retrieved 24 September 2023.
  15. Andrajyothy (18 July 2021). "మరోసారి వెన్నెల కిషోర్ డైరెక్షన్..!". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.