సీమ టపాకాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీమ టపాకాయ్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. నాగేశ్వరరెడ్డి
నిర్మాణం మల్ల విజయ్ ప్రసాద్
తారాగణం అల్లరి నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, రావు రమేష్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నేపథ్య గానం భాస్కరభట్ల రవికుమార్, శ్రావణ భార్గవి, కారుణ్య, గీతా మాధురి, జావేద్ ఆలీ, విశ్వ
నృత్యాలు బృంద, ప్రేమ్ రక్షిత్, కృష్ణారెడ్డి
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
సంభాషణలు మరుధూరి రాజా
కూర్పు కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ వెల్ఫేర్ క్రియేషన్స్
విడుదల తేదీ 13 మే 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సీమ టపాకాయ్ 2011 లో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం.[1] అల్లరి నరేష్, పూర్ణ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

కృష్ణ ఒక పెద్ద వ్యాపారవేత్తయైన జి. కె కొడుకు. పేదలకు సేవచేయడానికి అమితంగా తపన పడే సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి ధనవంతులంటే సదభిప్రాయం ఉండదు. అందుకని కృష్ణ తనని ఓ పేదవాడిగా నమ్మిస్తాడు. ఆ అమ్మాయిని నమ్మించడం కోసం తన కుటుంబ సభ్యులనందరినీ ఒప్పించి పేదవాళ్ళగా నటింపజేస్తాడు. సత్య తండ్రి ఒక ఫ్యాక్షనిస్టు. సత్య తన కుటుంబాన్ని కూడా వాళ్ళని పేదవాళ్ళగానే పరిచయం చేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో సత్యకు నిజం తెలుస్తుంది. తమ ఫ్యాక్షనిస్టు కుటుంబం వారితో సరిపోదని తెలిసి తండ్రితో పాటు ఊరెళ్ళి పోతుంది.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "సీమ టపాకాయ్ సినిమా సమీక్ష". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 6 November 2017. CS1 maint: discouraged parameter (link)