జి. నాగేశ్వరరెడ్డి
Appearance
జి. నాగేశ్వరరెడ్డి | |
---|---|
జననం | జి. నాగేశ్వరరెడ్డి |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2001 - |
జి. నాగేశ్వరరెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] ఎస్. వి. కృష్ణారెడ్డి సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన ఈయన 6 టీన్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[2]
సినిమారంగం
[మార్చు]చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తివున్న నాగేశ్వరరెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, నంబర్ వన్, ఘటోత్కచుడు, వజ్రం, మావిచిగురు, సంప్రదాయం వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 6 టీన్స్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య ప్రధాన సినిమాలకు దర్శకత్వం వహించాడు.
దర్శకత్వం వహించిన చిత్రాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | చిత్రపేరు | నటవర్గం |
---|---|---|---|
1 | 2001 | 6 టీన్స్ | రోహిత్, రుతిక, సంతోష్ పవన్ |
2 | 2001 | ఇదే నా మొదటి ప్రేమలేఖ | జయరాం, రిమ్మిసేన్ |
3 | 2002 | గర్ల్‌ఫ్రెండ్ | రోహిత్, బబ్లూ, సంతోష్ పవన్ |
4 | 2003 | ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి | శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత |
5 | 2003 | నేను సీతామహాలక్ష్మి | రోహిత్, శ్రావ్య |
6 | 2005 | గుడ్ బోయ్ | రోహిత్, నవనీత్ కౌర్ |
7 | 2007 | సీమ శాస్త్రి | అల్లరి నరేష్, ఫర్జానా |
8 | 2009 | కాస్కో | వైభవ్ రెడ్డి |
9 | 2011 | సీమ టపాకాయ్ | అల్లరి నరేష్ |
10 | 2012 | దేనికైనా రేడీ | మంచు విష్ణు, హన్సికా మోట్వాని |
11 | 2014 | కరెంట్ తీగ | మంచు మనోజ్ కుమార్, జగపతి బాబు, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ |
12 | 2016 | ఈడోరకం ఆడోరకం[3] | మంచు విష్ణు, సోనారిక భాడోరియా, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ |
13 | 2016 | ఆటాడుకుందాం రా | సుశాంత్, సోనం బజ్వా |
14 | 2016 | ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] | అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్ , కృష్ణ జయకుమార్, మౌర్యని |
15 | 2017 | ఆచారి అమెరికా యాత్ర[5] | మంచు విష్ణు |
16 | 2019 | తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ | సందీప్ కిషన్ |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా. "కథలున్నాయి.. దర్శకులున్నారు." Archived from the original on 23 February 2018. Retrieved 22 February 2018.
- ↑ జీ సినిమాలు (15 December 2016). "జి. నాగేశ్వరరెడ్డి". Archived from the original on 28 డిసెంబరు 2016. Retrieved 22 February 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - తారలతో ముచ్చట్లు (10 April 2016). "నమ్మకంతో వస్తున్నాం.. పొగరుతో కాదు: జి.నాగేశ్వరరెడ్డి". Retrieved 22 February 2018.[permanent dead link]
- ↑ సాక్షి, సినిమా (4 November 2016). "నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి". Retrieved 22 February 2018.
- ↑ ప్రజాశక్తి, సినిమా (20 January 2018). "'అల్లరి మొగుడు' గుర్తుకొస్తుంది - కె. రాఘవేంద్రరావు". Retrieved 22 February 2018.