Jump to content

ప్రభుదేవా

వికీపీడియా నుండి
(ప్రభు దేవా నుండి దారిమార్పు చెందింది)
ప్రభుదేవా
జననం
ప్రభుదేవా సుందరం

(1973-04-03) 1973 ఏప్రిల్ 3 (వయసు 51)
వృత్తినటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1988 - ప్రస్తుతం
బిరుదుఇండియన్ మైఖేల్ జాక్సన్
జీవిత భాగస్వామిరామలత, (1995-2010)
తల్లిదండ్రులుసుందరం మాస్టర్
బంధువులురాజు సుందరం (సోదరుడు)
నాగేంద్ర ప్రసాద్ (సోదరుడు)

ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు, దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు.[1] అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.[2] తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేయనారంభించాడు. తర్వాత నటుడిగా మారి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా, సహనటుడిగా కనిపించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) చిత్రంతో దర్శకుడిగా మారి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే.

బాల్యం, విద్య

[మార్చు]

కర్నాటక లోని మైసూర్ లో ఏప్రిల్ 3, 1973 లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. చిన్నతనంలో ఫుట్ బాల్ మీద ఆసక్తి ఉండేది. తండ్రి సుందరం మాస్టారు పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నటులు, నృత్యదర్శకులే.

సినీ జీవితం

[మార్చు]

నృత్య దర్శకుడిగా

[మార్చు]

తండ్రి నృత్య దర్శకుడు కావడంతో ప్రభుదేవాపై ఆ ప్రభావం పడింది. టీనేజ్ లో ఉండగానే తండ్రితో కలిసి సినిమా చిత్రీకరణకు వెళ్ళేవాడు. తన చదువు సరిగా సరిగా సాగడం లేదని తెలిసి తండ్రి దగ్గరే ఒకటిన్నర ఏడాదిపాటు సహాయకుడిగా ఉన్నాడు. తర్వాత లక్ష్మీనారాయణ మాస్టర్, ధర్మరాజు మాస్టర్ దగ్గర కూడా నృత్యంలో మెళకువలు నేర్చుకున్నాడు.

నృత్య దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
  • జగదేక వీరుడు అతిలోకసుందరి

నటుడిగా

[మార్చు]

తమిళంలో వచ్చిన ఇదయం, జెంటిల్మేన్ సినిమాల్లో కొన్ని పాటల్లో తెరపైన కనిపించాడు. తర్వాత దర్శకుడు పవిత్రన్ ప్రభుదేవాను ఇందు అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. తర్వాత వచ్చిన ప్రేమికుడు మంచి విజయాన్ని అందుకుంది. ఆయన తమిళంలో నటించిన చార్లీ చాప్లిన్‌ 2 సినిమాను మిస్టర్ ప్రేమికుడు పేరుతో 2021లో విడుదలైంది.

నటించిన తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

దర్శకునిగా

[మార్చు]

సిద్ధార్థ్ కథానాయకుడిగా ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాట్యం ప్రధానాంశంగా ఎం. ఎస్. రాజు నిర్మించిన పౌర్ణమి చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు.

వ్యక్తిగతం

[మార్చు]

ఇతడు రామలతను వివాహం చేసుకొన్నాడు, వీరికి ఇద్దరు కొడుకులు. సినీనటి నయనతార ను ప్రేమించుట వలన ఇద్దరు గొడవపడి విడాకులు పొందారు.

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Photos: prabhu-deva.jpg. Mid-day.com. Retrieved on 27 September 2013.
  2. ఎర్రకోట, నర్శిమ్ (2 Sep 2018). "ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అయ్యేవాణ్ని". eenadu.net. ఈనాడు. Archived from the original on 4 సెప్టెంబరు 2018. Retrieved 4 సెప్టెంబరు 2018.