జగపతి బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగపతి బాబు
Jagapathi Babu 60th South Filmfare Awards 2013.jpg
జననంవీరమాచినేని జగపతి బాబు
(1962-02-12) 1962 ఫిబ్రవరి 12 (వయస్సు: 57  సంవత్సరాలు)
మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, భారత్
నివాసంహైదరాబాదు, తెలంగాన, భారత్
ఎత్తు5 ft 11 in (180 cm)
తల్లిదండ్రులువి. బి. రాజేంద్రప్రసాద్

జగపతిబాబుగా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటులు. ఇతడు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారులు. ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారములను అందుకున్నారు.

నేపధ్యము[మార్చు]

జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్న జగపతిబాబు పుట్టింది మచిలీపట్నంలోనైనా మద్రాస్ లో పెరిగారు.

విజయవాడ వెళుతున్న విమానంలో జగపతిబాబు

మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగింది. చదువుకునే సమయంలో రోజుకు 3 - 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేదికాదు. ఎందుకంటే 12 ఏళ్ళ వయసులో సినిమాల్లోకి వెళ్ళను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్నిరోజులు విశాఖపట్నం లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు.

కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్ బాలేదని ఇప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు.

1994 లో యస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో నటించారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంతఃపురం' సినిమాలో చేసిన సారాయి వీరాజు పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరువాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారారు.

25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కున్న జగపతిబాబు, ఇక హీరోగా చేయడం వద్దనుకొని నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్‌ చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషించారు.

పురస్కారాలు[మార్చు]

నంది అవార్డులు

సినిమాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Retrieved 10 January 2020. Cite web requires |website= (help)