మిస్ ఇండియా (2020 సినిమా)
మిస్ ఇండియా | |
---|---|
దర్శకత్వం | నరేంద్ర నాథ్ |
రచన | నరేంద్ర నాథ్ |
నిర్మాత | మహేశ్ కోనేరు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | డాని సాంచెజ్-లోపెజ్ సుజిత్ వాసుదేవ్ |
కూర్పు | తమ్మరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీs | 14 నవంబరు, 2020 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్ ఇండియా, 2020 నవంబరు 4న విడుదలైన తెలుగు సినిమా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కొనేరు నిర్మించిన ఈ సినిమాకు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో కీర్తి సురేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించగా, డాని సాంచెజ్-లోపెజ్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతం సమకూర్చారు.[2] కీర్తి సురేష్ 20వ చిత్రం ఇది.[3] 2020, ఏప్రిల్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 2020, నవంబరు 4న నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగులో (తమిళం, మలయాళంలో డబ్ వెర్షన్లు) విడుదలైంది,[4] మిశ్రమ సమీక్షలను కూడా అందుకుంది.[5]
కథా నేపథ్యం
[మార్చు]మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మానస సంయుక్త (కీర్తి సురేష్), గొప్ప వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలు కంటుంటోంది.
నటవర్గం
[మార్చు]- కీర్తి సురేష్ (మానస సంయుక్త)[6]
- జగపతి బాబు (కైలాష్ శివ కుమార్/కెఎస్కె)
- రాజేంద్ర ప్రసాద్ (డాక్టర్ విశ్వనాథ శాస్త్రి, సంయుక్త తాత)
- నరేష్ (శివరామ కృష్ణ, సంయుక్త తండ్రి)
- నదియా (కమల, సంయుక్త తల్లి)
- నవీన్ చంద్ర (విజయ్ ఆనంద్)
- భానుశ్రీ మెహ్రా (సహన, సంయుక్త సోదరి)
- సుమంత్ శైలేంద్ర (విక్రమ్)
- కమల్ కామరాజు (అర్జున్, సంయుక్త సోదరుడు)
- ప్రవీణ్ (విజ్జు)
- పుజిత పొన్నాడ (పద్మ నైనా)
- దివ్య శ్రీపాద (ప్రీతి)
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం సమకూర్చాడు, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. కళ్యాణ్ చక్రవర్తి రాయగా, శ్రేయ ఘోషాల్, ఎస్. తమన్ పాడిన మొదటి పాట "కొత్తగా కొత్తగా" 2020, ఫిబ్రవరి 7న విడుదలైంది.[7] తదుపరి పాట శ్రీవర్ధిని పాడిన "లచ్చ గుమ్మడి" 2020, అక్టోబరు 28న విడుదల చేశారు.[8] హరికా నారాయణ్, శృతి రంజని పాడిన మూడవ పాట "థీమ్ ఆఫ్ మిస్ ఇండియా" 2020, అక్టోబరు 29న విడుదల చేశారు.[9] 2020, నవంబరు 2న అన్ని పాటలు విడుదలయ్యాయి.[10]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కొత్తగా కొత్తగా" | కళ్యాణ్ చక్రవర్తి | శ్రేయ ఘోషాల్, ఎస్.ఎస్. తమన్ | 3:23 |
2. | "లచ్చ గుమ్మడి" | కళ్యాణ్ చక్రవర్తి | శ్రీవర్థిని | 3:53 |
3. | "థీమ్ ఆఫ్ మిస్ ఇండియా" | కళ్యాణ్ చక్రవర్తి | హారిక నారాయణ్, శృతి రంజని | 3:49 |
4. | "నా చిన్ని లొక్కమ్మేయ" | నీరజ కోన | అదితి భావరాజు, రమ్య బెహరా, శ్రీ కృష్ణ | 3:53 |
మొత్తం నిడివి: | 14:58 |
మూలాలు
[మార్చు]- ↑ "Keerthy Suresh will next be seen in 'Miss India' directed by Narendranath". The Times of India. 27 January 2020. Retrieved 11 February 2021.
- ↑ "Mahanati Actress Keerthy Suresh's Next Film Titled Miss India". CNN-News18. 26 August 2019. Retrieved 11 February 2021.
- ↑ "Miss India teaser: Mahanti actress Keerthy Suresh embarks on an unconventional journey". Firstpost.com. 2019-08-27.
- ↑ Kumar, Karthik (24 October 2020). "Keerthy Suresh's Miss India set for November 4 release on Netflix, watch trailer". Hindustan Times. Retrieved 11 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Nasreen, Digital (5 November 2020). "Miss India Movie: Women's Motivational Story". Nazstory. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 11 February 2021.
- ↑ "Miss India trailer". YouTube. 24 October 2020. Retrieved 11 February 2021.
- ↑ "Makers Of Keerthy Suresh's 'Miss India' Release First Song 'Kotthaga Kotthaga'". Republic World. 8 March 2020. Retrieved 11 February 2021.
- ↑ "Lacha Gummadi Lyrical Video Song | Miss India Songs | Keerthy Suresh | Narendra Nath | Thaman S". youtube.com. 28 October 2020. Retrieved 11 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "#MissIndia Theme Lyrical Video Song | Miss India Songs | Keerthy Suresh | Narendra Nath | Thaman S". youtube.com. 29 October 2020. Retrieved 11 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Miss India Full Songs Jukebox || Keerthy Suresh | Narendra Nath || Thaman S". 2 November 2020. Retrieved 11 February 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
బయటి లింకులు
[మార్చు]- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2020 తెలుగు సినిమాలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- నదియా నటించిన సినిమాలు