కమల్ కామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమల్ కామరాజు
Kamal kamaraju1.jpg
జననం
కమల్ కామరాజు

(1981-09-03) 1981 సెప్టెంబరు 3 (వయస్సు 40)[1]
గాంధీ ఆశ్రమం, సేవాగ్రాం, మహారాష్ట్ర[2]
వృత్తినటుడు
ఆర్కిటెక్టు
రచయిత
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుప్రియా బిశ్వాన్(2013 – ప్రస్తుతం)[3]
వెబ్‌సైటుhttp://www.kamalkamaraju.com

కమల్ కామరాజు ఒక తెలుగు సినిమా నటుడు, ఆర్కిటెక్టు,, రచయిత.[4] గోదావరి, ఆవకాయ్ బిర్యానీ లాంటి సినిమాల్లో నటించాడు. మహారాష్ట్రలో జన్మించిన కమల్ హైదరాబాదులో పెరిగాడు. జె.ఎన్.టి.యు నుంచి ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేశాడు. సినిమాలపై మక్కువతో మొదట సహాయదర్శకుడిగా చేరి నటుడిగా మారాడు. డిసెంబరు 2013 న బెంగాలీ అమ్మాయి సుప్రియా బిశ్వాస్ ను వివాహమాడాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కమల్ మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమం, సేవాగ్రాంలో జన్మించాడు. హైదరాబాదులో పెరిగాడు. అక్కడే లిటిల్ ఫ్లవర్స్ హైస్కూల్లో చదువుకున్నాడు.[2] జె. ఎన్. టి. యు నుంచి ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేశాడు.[3] డిసెంబరు 2013 న బెంగాలీ అమ్మాయి సుప్రియా బిశ్వాస్ ను వివాహమాడాడు. సుప్రియ హైదరాబాదులోని ఈ బహుళ జాతీయ సంస్థలో కన్సల్టెంటుగా పనిచేస్తోంది.[5]

కెరీర్[మార్చు]

ఐతే సినిమా చూసి స్ఫూర్తి పొందిన అతనికి ఆ సినిమా దర్శకుడైన చంద్రశేఖర్ యేలేటి దగ్గర శిష్యరికం చేయాలనిపించింది. ఆయన దగ్గర పనిచేసే హనుమంతరావు సాయంతో అనుకోకుండా ఒక రోజు అనే సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత ఛత్రపతి సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకడిగా నటించాడు.[1] గోదావరి సినిమాలో కమల్ ది ఓ ముఖ్యమైన పోలీసు ఆఫీసర్ పాత్ర. అప్పుడే అనీష్ కురువిల్లాతో పరిచయం అయింది. అతనితో కలిసి కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్ అనే చిన్న సినిమా తీశారు. తర్వాత శేఖర్ కమ్ముల తన సహాయకుడైన అనీష్ కురువిల్లా దర్శకత్వంలో నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ సినిమాలో ఓ సెవెన్ సీటర్ ఆటో డ్రైవరుగా నటించాడు. కలవరమాయే మదిలో అనే సినిమాలో కలర్స్ స్వాతి సరసన హీరోగా నటించాడు. జాతీయ పురస్కారం పొందిన దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన విరోధి సినిమాలో కూడా కమల్ ది ప్రాముఖ్యమున్న పాత్ర. థ్రిల్లర్ సినిమాలతో పేరు సంపాదించిన శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన అరవింద్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Kamal Kamaraju". thetelugufilmnagar.com. thetelugufilmnagar.com. Retrieved 21 November 2016.
  2. 2.0 2.1 జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో కమల్ కామరాజు తో ముఖాముఖి". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 21 November 2016.
  3. 3.0 3.1 శేఖర్. "Kamal Kamaraju-Supriya Have A Bengali-Style Wedding". filmibeat.com. filmibeat.com. Retrieved 21 November 2016.
  4. "Red hot and deliciously different". The Hindu. 8 November 2008. Archived from the original on 7 నవంబర్ 2012. Retrieved 3 January 2010. Check date values in: |archive-date= (help)
  5. కవిరాయని, సురేష్. "Kamal Kamaraju to get married". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 21 November 2016.

బయటి లింకులు[మార్చు]