ఆవకాయ్ బిర్యానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆవకాయ్ బిర్యానీ
దర్శకత్వంఅనీష్ కురువిల్లా
నిర్మాతశేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల
తారాగణంకమల్ కామరాజు
బిందు మాధవి
రావు రమేష్
జొన్నాడ వరుణ్
కూర్పుప్రవీణ్ బోయిన
సంగీతంమణికాంత్ కద్రి
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఅమిగోస్ క్రియేషన్స్
విడుదల తేదీ
నవంబరు 14, 2008 (2008-11-14)
సినిమా నిడివి
140 నిమిషాలు
భాషతెలుగు

ఆవకాయ్ బిర్యానీ అనీష్ కురువిల్లా దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో కమల్ కామరాజు, బిందు మాధవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల కలిసి అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. మణికాంత్ కద్రి సంగీత దర్శకత్వం వహించాడు.[1]

ఆటో నడిపే అక్బర్ అనే వ్యక్తి ఆవకాయ తయారుచేసి అమ్మే లక్ష్మి అనే అమ్మాయి ప్రేమకథ ఈ సినిమా.

దేవరకొండ నుంచి వికారాబాద్ వరకు ఆటో నడుపుతూ ఉంటాడు అక్బర్. చదువులో పలుమార్లు విఫలమైనా ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటాడు. పోలవరంలో ఉండే లక్ష్మి అక్కడ తమ సర్వం కోల్పోవడంతో తన కుటుంబంతో కలిసి దేవరకొండకు వస్తుంది. ఆమె కుటుంబంతో కలిసి ఆవకాయలు, పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. ఆమె పచ్చళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవ్వాలని ఆమె లక్ష్యం. లక్ష్మి తండ్రికి ముస్లింలు అంటే ద్వేషం. కుటుంబంలో అందరికీ వాళ్ళకి దూరంగా ఉండమంటాడు. కానీ లక్ష్మి, అక్బర్ మాత్రం ఇద్దరూ ఒకరంటే ఒకరు అభిమానించుకుంటారు.

తారాగణం

[మార్చు]
 • అక్బర్ గా కమల్ కామరాజు
 • లక్ష్మిగా బిందు మాధవి
 • మాస్టర్ జీగా రావు రమేష్
 • జొన్నాడ వరుణ్
 • కామేశ్వర రావు
 • బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్
 • రాకే
 • ప్రణీత్ దుర్గేష్
 • మేరీ విజయ
 • రాజన్ పలనాటి
 • చార్వి
 • శ్రీ వినయ్ శ్రీధర్ .

పాటలు

[మార్చు]
 • నడిచే ఏడు అడుగుల్లో, చిత్ర, నరేష్ అయ్యర్
 • నన్ను చూపగల, ఆదామ్ , కార్తీక్, శ్వేతా
 • వీరుడైన ,శ్రేయా ఘోషల్ , కార్తీక్
 • చిందేసి చిన్నా పెద్దా , రంజిత్ , రాహూల్ నంబియార్, టిప్పు
 • అడిగడిగో , కార్తీక్
 • మామిడి కొమ్మకి ,మనికాంత కద్రి, సైందవీ

సాంకేతికవర్గం

[మార్చు]
 • కథ - చిత్రానువాదం - మాటలు - దర్శకత్వం: అనీష్ కురువిల్లా
 • సంగీతం: మణికాంత్ కద్రి
 • ఛాయాగ్రహణం: శాం దత్[2]
 • కూర్పు: ప్రవీణ్ బోయిన

మూలాలు

[మార్చు]
 1. "Avakai Biryani Movie Review, Trailers, Songs, Galleries, Photos, Interviews - 123telugu.com - Andhra Pradesh News and Views". www.123telugu.com. Retrieved 2020-07-08.
 2. "Avakai Biryani movie review - Telugu cinema Review - Allari Naresh & Sayali Bhagat". www.idlebrain.com. Retrieved 2020-07-08.

బయటి లంకెలు

[మార్చు]