Jump to content

బిందు మాధవి

వికీపీడియా నుండి
బిందు మాధవి
జననం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి.[1] ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది. బిందు మాధవి 2022లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మొదటి సీజన్‌లో విజేతగా నిలిచింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లె లో జన్మించింది.[3] ఆమె తండ్రి వ్యాపార పన్నుల విభాగంలో ఉప కమీషనరుగా పనిచేసేవాడు. ఉద్యోగ రీత్యా ఆయన తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు[3] లాంటి ప్రాంతాలకు మారి చివరకు చెన్నైలో స్థిరపడ్డాడు. ఆమె చదువు అక్కడే సాగింది.[4] ఆమె 2005 లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

ఆమె కళాశాలలో ఉన్నపుడే శరవణ స్టోర్స్ తరపున కొన్ని ప్రకటనలలో మోడల్ గా నటించింది. ఆమెకు సినిమాల్లో నటించాలని ఉండేది కానీ ఆమె తల్లిండ్రులు మొదట్లో అందుకు అంగీకరించలేదు. ఆమె తండ్రి ఏకంగా 8 నెలలపాటు మాట్లాడ్డం మానేశాడు. తల్లి కూడా అయిష్టంగానే ఉంది. చెన్నైలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన వెంకట్ రాం ఆమెకు ఫోటో షూట్ జరిపి ఆల్బం తయారు చేసి ఇచ్చాడు. బిందు మాధవి ఇప్పటికీ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటుంది.

ఆమె అలాగే మోడలింగ్ కొనసాగిస్తూ టీవీలో ప్రకటనల్లో నటించసాగింది. టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[3][5] అదే సమయంలో దర్శకుడు చేరన్ పొక్కిషమ్ అనే సినిమాలో ఓ సహాయ పాత్రను ఇచ్చాడు. 2009లో ఆమె నటించిన మరో చిత్రం దర్శకుడుపూరి జగన్నాధ్ నిర్మాతగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ అనే సినిమా. 2010లో ఓం శాంతి అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం దిల్ రాజు నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో రాం సరసన నటించింది. తరువాత గౌతం మేనన్ శిష్యురాలైన అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో [5]వచ్చిన వప్పం అనే తమిళ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించింది.[6]

ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడంతో తన దృష్టి అక్కడనే కేంద్రీకరించింది.[7] తమిళంలో ఆమె తరువాతి చిత్రం 2012లో విడుదలైన కళుగు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.[8]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2008 ఆవకాయ్ బిర్యానీ లక్ష్మి జంధ్యాల తెలుగు
2009 పొక్కిషం అంజలి తమిళం
బంపర్ ఆఫర్ ఐశ్వర్య తెలుగు
2010 ఓం శాంతి నూరి తెలుగు
రామ రామ కృష్ణ కృష్ణ నందు తెలుగు
ప్రతి రోజు భాను తెలుగు
2011 వెప్పం విజ్జి తమిళం
పిల్ల జమీందార్ అమృత తెలుగు
2012 కళుగు కవిత తమిళం
సట్టం ఒరు ఇరుత్తరై దియా తమిళం
2013 కేడీ బిల్లా కిల్లాడి రంగా మిత్ర మీనలోచని తమిళం
దేశింగు రాజా తామరై తమిళం
వరుదపడద వలిబర్ సంగం కల్యాణి తమిళం
2014 ఒరు కన్నియుం మూణు కలవాణియుం మలర్ తమిళం
2015 తమిళుకు ఎన్ ఒండ్రై అలుదవం సిమి తమిళం
సవాలే సమాలి దివ్య తమిళం
పసంగ 2 \ మేము విద్యా అఖిల్ తమిళం \ తెలుగు
2016 జాక్సన్ దురై విజ్జి తమిళం

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bindu Madhavi Profile". Retrieved 3 September 2014.
  2. Eenadu (22 May 2022). "బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేత.. బిందు మాధవి". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.
  3. 3.0 3.1 3.2 "Bindu Madhavi interview - Telugu Cinema interview - Telugu film actress". Idlebrain.com. 2008-11-03. Archived from the original on 2012-06-24. Retrieved 2012-08-01.
  4. "Exclusive Interview With Bindu Madhavi - Interviews". CineGoer.com. 2009-07-13. Archived from the original on 2012-09-29. Retrieved 2012-08-01.
  5. 5.0 5.1 Sreedhar Pillai, TNN (2010-11-09). "Veppam to give Bindu a break". The Times of India. Archived from the original on 2012-11-03. Retrieved 2012-08-01.
  6. Gupta, Rinku. "Bindu Madhavi, actress". The New Indian Express. Archived from the original on 2015-04-02. Retrieved 2014-04-03.
  7. "Bindu Madhavi shifts to Tamil industry!". Sify.com. 2012-01-03. Archived from the original on 2014-04-22. Retrieved 2014-04-03.
  8. "Bindhu Madhavi happy in Tamil cinema - The Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2014-04-03.