Jump to content

న్యూసెన్స్

వికీపీడియా నుండి
న్యూసెన్స్
రచనప్రియదర్శిని రామ్
మాటలుజయసింహ నీలం
నిర్మాతటీజీ విశ్వప్రసాద్
వివేక్ కూచిభొట్ల
తారాగణం
ఛాయాగ్రహణం
  • వేదరామన్ శంకరన్, అనంత్ నాగ్ కావూరి, ప్రసన్న కుమార్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

న్యూసెన్స్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. నవదీప్, బిందు మాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 09న విడుదల చేసి, సినిమాను మే 12న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[1][2]

మదనపల్లిలో శివ (నవదీప్) రిప‌బ్లిక్ ఛానెల్‌లో జర్నలిస్ట్. ఆ ఏరియాలో జర్నలిస్టులంతా కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని వార్త‌ల్ని రాస్తుంటారు. మ‌ద‌న‌ప‌ల్లిలో అధికార పార్టీ నాయ‌కుడు క‌రుణాక‌ర్‌రెడ్డితో (గ‌బ్బ‌ర్‌) పాటు ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ నాగిరెడ్డి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తుంటుంది. స్థానిక ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతోన్న స‌మ‌యంలో శివపై దాడి జరుగుతుంది. ఈ క్రమంలో మ‌ద‌న‌ప‌ల్లికి కొత్త‌గా ఎస్సై ఎడ్విన్ (నంద గోపాల్) రాకతో జర్నలిస్టులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? శివ గతం ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • నవదీప్
  • బిందు మాధవి
  • మహిమా శ్రీనివాస్
  • నంద గోపాల్
  • కట్టా ఆంటోనీ
  • కుమారి
  • షెల్లీ నబు కుమార్
  • చరణ్ కురుగొండ
  • రమేష్ కోనంభొట్ల
  • శ్వేతా చౌదరి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
  • నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
  • కథ: ప్రియదర్శిని రామ్
  • స్క్రీన్‌ప్లే: ప్రియదర్శిని రామ్, జయసింహ నీలం, శ్రీ ప్రవీణ్ కుమార్
  • దర్శకత్వం: శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్, అనంత్ నాగ్ కావూరి, ప్రసన్న కుమార్
  • మాటలు : జయసింహ నీలం
  • పాటలు : పుట్టా పెంచల్ దాస్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (6 May 2023). "ఓటీటీలో నవదీప్‌ 'న్యూసెన్స్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 16 May 2023. Retrieved 16 May 2023.
  2. "ఆహాలో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తికరంగా 'న్యూసెన్స్' టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." TV9 Telugu. 22 March 2023. Archived from the original on 1 February 2026. Retrieved 1 February 2026.
  3. Eenadu (16 May 2023). "రివ్యూ: 'న్యూసెన్స్‌' (వెబ్‌ సిరీస్).. నవదీప్‌, బిందు మాధవి నటన ఎలా ఉందంటే?". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.