Jump to content

ఛత్రపతి (సినిమా)

వికీపీడియా నుండి
ఛత్రపతి
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాణం బివిఎస్ఎన్ ప్రసాద్
రచన ఎస్. ఎస్. రాజమౌళి
విజయేంద్ర ప్రసాద్,
ఎం. రత్నం
తారాగణం ప్రభాస్,
శ్రియా,
భానుప్రియ,
ప్రదీప్ రావత్,
జయప్రకాశ్ రెడ్డి
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం సెంధిల్ కుమార్
కూర్పు కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి
భాష తెలుగు

ఛత్రపతి 30 డిసెంబర్ 2005న రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. ప్రభాస్, శ్రీయ ఇందులో నాయకా నాయికలుగా నటించారు. ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణికి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియకు నంది పురస్కారాలు దక్కాయి. 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.[1] అప్పట్లో ఈ చిత్రం 30 కోట్లు వసూలు చేసింది. ఆ సంవత్సరం పెద్ద హిట్ గా నిలిచింది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

సంగీతం : ఎం ఎం కీరవాణి

కథ : విజయేంద్ర ప్రసాద్

మాటలు : ఎం రత్నం

పాటలు : వేటూరి, చంద్రబోస్, శివశక్తి దత్తా

ఆర్ట్ : ఆర్ రవీందర్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ : కె కె సెంథిల్ కుమార్

యాక్షన్ : పీటర్ హైన్స్

స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

నేపథ్య గాయకులు: యం. యం.కీరవాణి, మాతంగి జగదీష్, మంగారి, సునీత, స్మిత, కళ్యాణ్ మాలిక్, నీరజ్ పండిట్, చిత్ర, టిప్పు, కరాటే కళ్యాణి, జెస్సీగిఫ్ట్, నీరిప్పల్

నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ ఎల్ పి

విడుదల:30:12:2005 .

నిర్మాణం

[మార్చు]

ప్రభాస్ ని కొత్తగా చూపించాలన్న తపనతో దర్శకుడు రాజమౌళి ప్రభాస్ నటించిన ముందు సినిమాలను పరిశీలించారు. అడవి రాముడు (2004) సినిమాలో ఒక భావోద్వేగ సన్నివేశంలో ప్రభాస్ చూపించిన అభినయాన్ని చూసి, తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాశాడు. తర్వాత దానికి కావలిసినన్ని యాక్షన్ సన్నివేశాలు చేర్చారు. కథా చర్చలు జరుగుతుండగా దర్శకత్వ శాఖలో పనిచేసే ఒక వ్యక్తి ఛత్రపతి అనే టైటిల్ సూచించడం, దాన్ని విజయేంద్రప్రసాద్ అంగీకరించాడు.[1]

శ్రీలంక నుంచి శరణార్ధిగా వచ్చినవాడు శివాజీ (ప్రభాస్‌). వలస వచ్చే క్రమంలో తల్లి (భానుప్రియ), సవతి తమ్ముడు (షఫి) నుంచి తప్పిపోతాడు. చిన్నప్పుడే జరిగిన సంఘటన శివాజీని నిరంతరం వెంటాడుతుంది. పనికోసం విశాఖపట్నం వచ్చి బాజీరావు అనే స్ధానిక మాఫియా నాయకుడి వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. బాజీరావు నిర్బంధంగా పని చేయించికుంటూ తలెత్తిన వారి తల లేకుండా చేస్తుంటాడు. ఒకరోజు ఒక శరణార్ధి తనవారి కోసం వెళుతుంటే అడ్డుపడతాడు. అది చూసి శివాజీ తిరగబడి బాజీరావును, అతని మనుషులను చంపి అక్కడి వారికి స్వాతంత్య్రం కలిగిస్తాడు. ఛత్రపతిగా ఎదుగుతాడు. అయినా శివాజీకి సంతృప్తి కలగదు. తప్పిపోయిన తనవారి కోసం తపన పడుతుంటాడు. తల్లి అడ్రసు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అక్కడ పరిచయమైన ఆఫీసరు నీలవేణి (శ్రీయ) అతనితో ప్రేమలో పడుతుంది.

ఒకరోజు శివాజీకి అనుకోకుండా తమ్ముడు షఫీ కన్పిస్తాడు. షఫి తన అన్నను గుర్తిస్తాడు. శివాజీ తల్లి వద్దకు చేరకుండా షఫీ అడ్డుపడుతుంటాడు. తన తమ్ముడు బాజీరావును చంపిన ఛత్రపతిని సంహరించడానికి రాజ్‌ బిహారీ (ప్రదీప్‌ రావత్‌) రంగంలోకి దిగుతాడు. తాను ఎంతగానో ప్రేమించే తల్లిని ఎలా చేరుకుంటాడన్నది తెర మీద చూడాల్సిందే.[2]

పాటల జాబితా

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: ఎం. ఎం. కీరవాణి.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏ వచ్చి బి పై వాలీ"చంద్రబోస్ఎం. ఎం. కీరవాణి, మాతంగి జగదీష్4:44
2."అగ్ని స్ఖలన"శివశక్తి దత్తాఎం. ఎం. కీరవాణి, మాతంగి జగదీష్, మంగారి3:09
3."సుమ్మ మసూరియా"చంద్రబోస్సునీత, స్మిత, కళ్యాణి మాలిక్, నీరజ్ పండిట్4:40
4."నల్లనివన్నీ"వేటూరికె. ఎస్. చిత్ర5:30
5."మన్నెలా తింటివిరా"శివశక్తి దత్తాటిప్పు, స్మిత, కరాటే కల్యాణి4:58
6."గుండుసూది"చంద్రబోస్సునీత, ఎం. ఎం. కీరవాణి4:18
7."గల గల గల"చంద్రబోస్కె. ఎస్. చిత్ర, జెస్సీ గిఫ్ట్, నీరిప్పల్4:40
మొత్తం నిడివి:31:59

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Chatrapathi: ఆ ఎమోషనల్‌ సీన్‌.. 'ఛత్రపతి'కి కారణమైంది.. టైటిల్‌ అలా ఫిక్స్‌ అయింది". EENADU. Retrieved 2025-09-30.
  2. Staff (2009-08-12). "సెకండాఫ్‌లో చల్లబడిన 'ఛత్రపతి'". https://telugu.filmibeat.com. Retrieved 2026-01-04. {{cite web}}: External link in |website= (help)