కోసూరి వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోసూరి వేణుగోపాల్
జననం
నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా
మరణం2020 సెప్టెంబరు 23
హైదరాబాద్
మరణ కారణంకరోనా
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1994 - 2020

కోసూరి వేణుగోపాల్ ఒక తెలుగు సినిమా, టివి నటుడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఈయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తూ పదవీవిరమణ చేశాడు. ఉద్యోగం చేస్తూనే దాదాపు 27 సంవత్సరాలకుపైగా 30 కిచిత్ర పరిశ్రమలో నటిస్తూ వచ్చాడు. పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు అనే చిత్రంతో నటుడుగా తన ప్రస్థానం ప్రారంభించాడు. 2010లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న ఆయనకు బాగా పేరు తెచ్చింది.

2020 సెప్టెంబరు 23 న కరోనా వ్యాధి కారణంగా మృతి చెందాడు.[1]

సినీరంగం[మార్చు]

కోసూరి వేణుగోపాల్ 27 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు (1994) నటుడిగా ఆయనకు తొలి చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న ఆయనకు బాగా పేరు తెచ్చింది. ఇందులో ఆయన బ్రహ్మాజీ తండ్రి పాత్ర పోషించాడు. ఒక్క స్టూడెంట్ నంబర్ 1 తప్ప మిగతా అన్ని రాజమౌళి సినిమాల్లోనూ ఈయన నటించాడు.[2] నాగ శౌర్య కథానాయకుడిగా వచ్చిన ఛలో చిత్రంలో వెన్నెల కిషోర్ తండ్రి పాత్ర పోషించాడు. నటుడిగా ఆయన చివరి చిత్రం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమీ తుమీ.[3]

మరణం[మార్చు]

కరోనా వ్యాధి సోకి హైదరాబాదులోని గచ్చిబౌలిలో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు 23 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. తర్వాత కరోనా నెగటివ్ వచ్చినా, 2020 సెప్టెంబరు 23 న మృతి చెందాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్‌ మృతి". www.eenadu.net. Retrieved 2020-09-24.
  2. "Tollywood comedian Venugopal Kosuri passes away due to coronavirus - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-24.
  3. "Telugu actor Kosuri Venu Gopal passes away". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-24. Retrieved 2020-09-24.
  4. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 27 మార్చి 2021 suggested (help)