అహింస (2023 సినిమా)
అహింస | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | తేజ |
మాటలు | వివేక్ |
నిర్మాత | పీ. కిరణ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ |
విడుదల తేదీs | 2 జూన్ 2023(థియేటర్) 4 డిసెంబరు 2023 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అహింస 2023లో తెలుగులో విడుదలైన ప్రేమకథ సినిమా. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ. కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. దగ్గుబాటి అభిరామ్, గీతికా, సముద్రఖని, రజత్ బేడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 5న విడుదల చేయగా,[1] సినిమా 2023 జూన్ 2 చేసి[2][3], డిసెంబర్ 04 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- దగ్గుబాటి అభిరామ్
- గీతికా తివారీ
- సదా
- సముద్రఖని
- రజత్ బేడీ
- రవి కాలే
- కమల్ కామరాజు
- మనోజ్ టైగర్
- కల్పలత
- దేవీ ప్రసాద్
- సమీర్ గోస్వామి
- బిందు చంద్రమౌళి
- రమణదీప్ కౌర్
కథ
[మార్చు]రఘు (దగ్గుబాటి అభిరామ్), అహల్య (గీతిక) వరుసకు బావ మరదలు, వారిద్దరూ ప్రేమించుకొని నిశ్చితార్థం చేసుకుంటారు. అయితే అహల్యపై అత్యాచారం జరుగుతుంది. అత్యాచారం చేసిన నిందితులు డబ్బు, అధికారంపరంగా శక్తివంతంగా ఉంటారు. వారిపై రఘు న్యాయ పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలో రఘు కు న్యాయవాది లక్ష్మి (సదా) అండగా నిలుస్తుంది. ఈ పోరాటంలో ఏం జరిగింది రఘు న్యాయపోరాటంలో గెలిచాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్
- నిర్మాత: పీ. కిరణ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
- సంగీతం: ఆర్. పి. పట్నాయక్
- సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
- మాటలు: అనిల్ అచుగుట్ల
- పాటలు: చంద్రబోస్
- ఆర్ట్ : సుప్రియ
- యాక్షన్ డైరెక్టర్: బీవీ రమణ
- ఫైట్స్: రియల్ సతీష్
- కోరియోగ్రఫీ: శంకర్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (6 October 2022). "అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??". Archived from the original on 5 March 2023. Retrieved 5 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (5 March 2023). "ఏప్రిల్ 7న 'అహింస' గ్రాండ్ రిలీజ్". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
- ↑ Namaste Telangana (29 October 2023). "తేజ-అభిరామ్ అహింసను థియేటర్లలో మిస్సయ్యారా ?.. అయితే గెట్ రెడీ". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Andhrajyothy (4 December 2023). "OTT: సైలెంట్ గా.. 6నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తేజ 'అహింస'". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sakshi (2 June 2023). "'అహింస' మూవీ రివ్యూ". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.