మా వింత గాధ వినుమా
మా వింత గాధ వినుమా | |
---|---|
దర్శకత్వం | ఆదిత్య మండల |
రచన | సిద్ధు జొన్నలగడ్డ |
నిర్మాత | సంజయ్ రెడ్డి అనిల్ పల్లాల |
తారాగణం | సిద్ధు జొన్నలగడ్డ సీరత్ కపూర్ తనికెళ్ళ భరణి శిశిర్ శర్మ కమల్ కామరాజు |
ఛాయాగ్రహణం | సాయిప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | సిద్ధు జొన్నలగడ్డ |
సంగీతం | జాయ్ శ్రీచరణ్ పాకాల రోహిత్ |
నిర్మాణ సంస్థ | సిల్లీ మాంక్స్ స్టూడియోస్ |
పంపిణీదార్లు | ఆహా (ఓటిటి) |
విడుదల తేదీ | 13 నవంబరు 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మా వింత గాధ వినుమా, 2020 నవంబరు 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. సిల్లీ మాంక్స్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే అందించాడు. సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, తనికెళ్ళ భరణి, శిశిర్ శర్మ, కమల్ కామరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆహా (ఓటిటి)లో విడుదలయింది.
కథా సారాంశం
[మార్చు]సిద్ధూ (సిద్ధు జోన్నలగడ్డ)కు జీవతమంటే నిర్లక్ష్యంగా ఉంటాడు. కొన్నేళ్లుగా తను ప్రేమిస్తున్న వినీత (సీరత్ కపూర్) ప్రేమకోసం అనేక ప్రయత్నిస్తుంటాడు. వినీత కూడా సిద్ధూను ప్రేమిస్తుంది. ఒకరోజు సిద్ధుతో కలిసి వినీత తన సోదరుడి (కమల్ కామరాజు) ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం గోవాకు వెళ్తుంది. అక్కడ అనుకోని పరిస్థితులు ఏర్పడి తాగిన మత్తులో సిద్ధూ వినీత పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి వీడియో అందరికి వెలుతుంది. దాంతో వాళ్ళద్దరికిలో మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- సిద్ధు జొన్నలగడ్డ (సిద్ధు)
- సీరత్ కపూర్ (వినితా వేణుగోపాల్)
- తనికెళ్ళ భరణి (పోలీసు అధికారి)
- జయప్రకాష్
- శిశిర్ శర్మ
- కమల్ కామరాజు
- ఫిష్ వెంకట్
- ప్రగతి
- వైవా హర్ష
- మంచు లక్ష్మి
- కల్పిక గణేష్
- రాజశ్రీ నాయర్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఆదిత్య మండల [1]
- నిర్మాణం: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లల
- రచన, ఎడిటింగ్: సిద్ధు జొన్నలగడ్డ
- సంగీతం: శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్
- సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
- నిర్మాణ సంస్థ: సిల్లీ మాంక్స్ స్టూడియోస్
- పంపిణీదారు: ఆహా (ఓటిటి)
నిర్మాణం
[మార్చు]కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ ఈ చిత్రంలో మళ్ళీ కలిసి నటించారు.[2] సీరత్ కపూర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.[3][4] 2020 సెప్టెంబరులో ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది.[5]
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల – రోహిత్ – జాయ్ సంగీతం అందించగా సిద్ధు జొన్నలగడ్డ, ఆదిత్య మండల పాటలు రాశారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "జాన" | సిద్ధు జొన్నలగడ్డ, ఆదిత్య మండల | అయాన్ | 4:31 |
2. | "దూరంగా" | కిట్టు విస్సాప్రగడ | సాహితి చాగంటి, పూజన్ కొహ్లి | 3:31 |
3. | "షాయర్-ఈ-ఇష్క్" | సిద్ధు జొన్నలగడ్డ | సిద్ధు జొన్నలగడ్డ | 2:35 |
మొత్తం నిడివి: | 11:00 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 May 2021). "ఓటీటీలో ఓహో అనిపించారు! - Sunday Magazine". EENADU. Archived from the original on 30 మే 2021. Retrieved 30 May 2021.
- ↑ "Seerat Kapoor's "Maa Vintha Gaadha Vinuma" all set for Diwali release – Times of India". The Times of India.
- ↑ Pasupuleti, Priyanka. "Childhood love is innocent: Seerat Kapoor". Telangana Today.
- ↑ "Seerat Kapoor: I want to try out every genre possible". The New Indian Express.
- ↑ "Maa Vintha Gadha Vinuma team wraps up post-production work – Times of India". The Times of India.