గద్దె రాజేంద్ర ప్రసాద్

వికీపీడియా నుండి
(రాజేంద్ర ప్రసాద్ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజేంద్ర ప్రసాద్
Rajendra Prasad at QGM audio launch.jpg
క్విక్ గన్ మురుగన్ సినిమా పాటల విడుదల వేడుకలో తన పాత్ర వేషధారణతో వచ్చిన రాజేంద్ర ప్రసాద్
జన్మ నామం గద్దె రాజేంద్ర ప్రసాద్
జననం (1956-07-19) జూలై 19, 1956 (వయస్సు: 59  సంవత్సరాలు)
భారతదేశం నిమ్మకూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేరు(లు) నట కిరీటి
ప్రముఖ పాత్రలు ఎర్ర మందారం (1991),
లేడీస్ టైలర్ (1985),
అహ నా పెళ్ళంట (1987)

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకుని వెళ్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి.

నట కిరీటి గురించి[మార్చు]

హీరో అంటే పైట్లు, పాటలు అనే మార్కును తొలగించి... హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించిన నటుడు రాజేంద్రప్రసాద్. కేవలం హాస్యాన్నే గాక.. నవరసాల్ని పండించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడీ ఆంధ్రా చార్లీచాప్లిన్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో... సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో... హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో అద్భుతాలు నమోదు చేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. కేవలం నవ్వించడమే కాదు ఏడిపించడంలోనూ మన నటరాజు సిద్ధహస్తుడే. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా... నటకిరీటి కీర్తి క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ దాకా పాకింది. రెండు నంది అవార్డుల సహా ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. రాజేంద్ర ప్రసాద్ నటుడే కాదు నటి కూడా. మేడమ్ సినిమా ఇందుకు చక్కని ఉదాహరణ. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కు ఏప్రిల్, 2015 లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు .ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాడు . ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్, జయసుధ లు అధ్యక్ష పదవికి పోటీ పడగా తీవ్ర ఉత్కంఠ మద్య వెలువడిన ఫలితాలు జయసుధ, మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి . జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రుడి గెలుపు అనూహ్యంగా తోచింది . రాజేంద్రుడి గెలుపుతో కొన్ని పెద్ద ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి . రాజేంద్రప్రసాద్ 83ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు . రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు

సినీ జీవితం[మార్చు]

నటించిన చిత్రాల పాక్షిక జాబితా[మార్చు]

సంగీత దర్శకత్వం[మార్చు]

దర్శకత్వం[మార్చు]