మొగుడు (సినిమా)
మొగుడు (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణవంశీ |
---|---|
కథ | కృష్ణవంశీ |
చిత్రానువాదం | కృష్ణవంశీ |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్ తాప్సీ గద్దె రాజేంద్ర ప్రసాద్ శ్రద్దా దాస్ |
సంగీతం | బాబూ శంకర్ |
సంభాషణలు | భీమ్ |
ఛాయాగ్రహణం | శ్రీకాంత్ |
కూర్పు | గౌతంరాజు |
నిడివి | 166 నిమిషాలు |
భాష | తెలుగు |
మొగుడు 2011 నవంబరు 4 న విడుదలైన తెలుగు చిత్రం. తొట్టెంపూడి గోపీచంద్. తాప్సీ జంటగా నటించగా కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించాడు. రాజేంద్ర ప్రసాద్, రోజా సహాయక పాత్రల్లో నటించారు. బాబు శంకర్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నమోదైంది.[2] తన భార్యను అర్థం చేసుకుని, ఆమె ప్రేమను గెలుచుకున్నప్పుడే మనిషి నిజమైన భర్త అవుతాడనేది ఈ చిత్ర ఇతివృత్తం.[3] ఈ చిత్రం 2011 4 నవంబరు 4 నవిడుదలైంది.
కథ
[మార్చు]బుజ్జీ ( గోపిచంద్ ) ధనవంతుడు, పలుకుబడి గల రైతు అంజనేయ ప్రసాద్ ( రాజేంద్ర ప్రసాద్ ) యొక్క ఏకైక కుమారుడు. వారి కుటుంబం బాగా అన్యోన్యంగాను, బలమైన విలువలు పరస్పర అనురాగం కలిగీ ఉంటుంది. బుజ్జీ ఊహించని పరిస్థితులలో రాజ రాజేశ్వరి (తాప్సీ పన్నూ) ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. రాజీ ఒక శక్తివంతమైన రాజకీయ నాయకురాలైన చాముండేశ్వరి ( రోజా ) శంకర్ రావు ( నరేష్ ) ల కుమార్తె. రెండు కుటుంబాలూ పెళ్ళికి అంగీకరిస్తాయి. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఊహించని పరిస్థితుల వలన ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఈ సమయంలో బుజ్జీ అంటే పిచ్చి ప్రేమ ఉన్న జో ( శ్రద్ధా దాస్ ) వస్తుంది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. బుజ్జీ కుటుంబాల మధ్య ఉన్న విభేదాలను సరిచేసి తన భార్యను తిరిగి గెలుచుకుంటాడా అనేది మిగతా సినిమా.
తారాగణం
[మార్చు]- బుజ్జిగా గోపిచంద్
- రాజీగా తాప్సీ
- జోగా శ్రద్ధా దాస్
- ఆంజనేయ ప్రసాద్ గా గద్దె రాజేంద్ర ప్రసాద్
- చాముండేశ్వరిగా రోజా
- శంకరరావుగా నరేష్
- ఆహుతి ప్రసాద్
- వేణు మాధవ్
- కృష్ణుడు
- ప్రవీణ్
- నర్సింగ్ యాదవ్
- మహర్షి రాఘవ
- డా. సాగర్ గాహర్ష వర్ధన్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "కావాలి కావాలి" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మధుమిత, బాబు శంకర్ | 5:31 |
2. | "బాచిలర్ బాయ్స్" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | బెన్నీ దయాళ్, బాబు శంకర్ | 3:58 |
3. | "చూస్తున్నా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కార్తిక్ | 4:29 |
4. | "ఆకల కలలా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | హేమచంద్ర, చిన్మయి | 4:21 |
5. | "ఎప్పుడు నీ రూపంలో" | Sirivennela Sitarama Sastry | కార్తిక్ | 4:40 |
6. | "నువ్వంటే నాకు" | రామజోగయ్య శాస్త్రి | సునీత సారథి | 4:34 |
7. | "ఎట్టాంటి మొగుడు" | సుద్దాల అశోక్ తేజ | గీతా మాధురి | 4:56 |
8. | "చూస్తున్నా" (Fusion Mix) | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కార్తిక్ | 4:29 |
మొత్తం నిడివి: | 37:14 |
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Radhika Rajamani. "First Look: Krishnavamsi's Mogudu". Rediff. Retrieved 12 September 2011.
- ↑ Radhika Rajamani. "'Mogudu is inspired from my personal experiences'". Rediff. Retrieved 3 November 2011.
- ↑ "Krishna Vamsi takes a leaf from real life incident for Mogudu". Oneindia.in. Archived from the original on 12 అక్టోబరు 2013. Retrieved 3 November 2011.