బావ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బావ
Baava poster.jpg
దర్శకత్వంరాంబాబు
నిర్మాతఎం. ఎల్. కుమార్ చౌదరి
రచనరాంబాబు
నటులుసిద్దార్థ్,
ప్రణీత,
తనికెళ్ళ భరణి
గద్దె రాజేంద్ర ప్రసాద్,
ఆలీ (నటుడు)
బ్రహ్మానందం
ఆహుతి ప్రసాద్
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంఅరవింద్ కృష్ణ
పంపిణీదారుశ్రీ కీర్తి కంబైన్స్
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

బావ 2010 అక్టోబరు 29 న విడుదలైన తెలుగు చిత్రం. సిద్దార్థ్, ప్రణీత, గద్దె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన తారాగణం. రాంబాబు దర్శకత్వంలో శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంఎల్ పద్మ కుమార్ చౌదరి నిర్మించాడు. చక్రి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది. ఈ మూవీని బంగ్లాదేశ్ బెంగాలీలో భలోబాసర్ రోంగ్గా 2012 లో రీమేక్ చేశారు.

కథ[మార్చు]

వీరబాబు ( సిద్ధార్థ్ ) తల్లిదండ్రులతో కలిసి ఒక గ్రామంలో నివసించే యువకుడు. అతని తండ్రి సీతారాముడు ( రాజేంద్ర ప్రసాద్ ) ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ( పవిత్ర లోకేష్ ) ను ఆమె కుటుంబ అభీష్టాలకు విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటాడు. ఆమె పెద్దలు వారిని తమ కుటుంబంలో భాగంగా అంగీకరించరు. తన భార్యను ఆమె కుటుంబం నుండి వేరు చేసానే అని తన జీవితమంతా సీతారామ్ బాధపడుతూంటాడు. ఒక పెద్ద కుటుంబంలో తానూ భాగం కావాలని ఆరాటపడుతూంటాడు. తన కుమారుడు వీరబాబు పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటాడు. ఇంతలో, వీరబాబు సమీప గ్రామానికి చెందిన వరలక్ష్మి ( ప్రణిత ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తరువాత ఆమె వీరబాబు తల్లి తరపున బంధువు అని తెలుస్తుంది. ఆమె బంధువులు వారి వివాహానికి అంగీకరించరు. తన కుమారుడి విధి తనలాగే జరుగుతుందని బాధపడుతున్న సీతారామ్, కొడుకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకోకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తాడు. అయితే, తరువాత అతను తన కొడుక్కు సహాయం చేస్తాడు. వీరబాబు తన ప్రియురాలి కుటుంబ సభ్యుల హృదయాలను ఎలా గెలుచుకుంటాడు వారి కుటుంబం ఈ జంటను ఎలా అంగీకరిస్తుందనేది మిగతా కథ

తారాగణం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "పన్నెండేళ్ళ ప్రాయం"  కీరవాణి 6:14
2. "నా రామచిలక"  వాసు 4:56
3. "మిలమిలమని సూర్య"  రంజిత్, హరిణి 5:00
4. "నగర నగారా"  చక్రి, గీతామాధురి 4:50
5. "రుద్రుడు రాముడు"  మనో 4:31
6. "బావా బావా"  సిద్దార్థ 5:40
మొత్తం నిడివి:
31:25

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Siddharth's Baava releasing on Oct 29". Archived from the original on 8 December 2010.