స్నేహం (సినిమా)
స్నేహం (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బాపు |
తారాగణం | రావు గోపాలరావు , మాధవి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | సాగర్ చిత్ర |
భాష | తెలుగు |
ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ (బరజాత్యా కుటుంబం) హిందీలో నిర్మించిన 'దోస్తీ' చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. 'చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే' పాట అప్పటికే మరో బాపు చిత్రం రామాంజనేయ యుద్ధంలో తెలుగులో వినపడింది (రఘురామయ్య స్వరం తో). స్నేహంలో 'నీవుంటే వెరే కనులెందుకు' ఆ పాటకు తీసిపోయేది కాదు.
తారాగణం
[మార్చు]రావు గోపాలరావు
మాధవి
రాజేంద్రప్రసాద్
సాయికుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బాపు
నిర్మాత: సి.హెచ్.సీతారామరాజు
నిర్మాణ సంస్థ: సాగర్ చిత్ర
సంగీతం: కె.వి.మహాదేవన్
పాటలు: ఆరుద్ర, సి నారాయణ రెడ్డి
మాటలు: ఎం వి.ఎల్.
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
కెమెరా: ఇషాన్ ఆర్య
కూర్పు: మందపాటి రామచంద్రయ్య
విడుదల:14:09:1977.
పాటలు
[మార్చు]స్నేహం సినిమా పాటలకు, నేపథ్య సంగీతానికి కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించగా, సినిమాలో పాటలను ఆరుద్ర, సినారె రచించారు.[1]
స్వరకల్పన
[మార్చు]స్నేహం సినిమాకు సంగీత దర్శకునిగా బాపు తన సినిమాలకు తొలి నుంచీ సంగీతం అందిస్తున్న కె.వి.మహదేవన్ నే ఎంచుకున్నారు. సినిమాలోని పాటలను బాపు తన అభిరుచికి అనుగుణంగా గజల్ శైలిలో రాయించి, స్వరకల్పన చేయించుకున్నారు. "పల్లె మేలుకుందీ రేపల్లె మేలుకుందీ" పాటను గజల్ చక్రవర్తిగా పేరొందిన మెహదీ హసన్ స్వరపరచి పాడిన "అబ్ కె హం బిచ్‌డే" ఛాయల్లో స్వరపరిచారు. "పోనీరా పోనీరా" అనే మరో పాట మెహదీ హసన్ గజల్ "రోషన్" ఛాయల్లో సర్వకల్పన చేశారు. "నవ్వు వచ్చిందంటే కిలకిల" అనే పాటను మెహదీ హసన్ "చల్ చల్ రే" గజల్ రీతిలో స్వరపరిచారు.[2] "నీవుంటే వేరే కనులెందుకనీ" వంటి గీతాలు కూడా గజల్ ఛాయల్లోనే ఉంటాయి.
పాటలు
[మార్చు]- ఎగరేసిన గాలిపటాలు దొంగాట దాగుడు మూతలు - గానం: పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
- నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటే వలవల - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:ఆరుద్ర
- పువ్వు పువ్వు ఏమి పువ్వు; మల్లె పువ్వు ఏం మల్లి; కొండ మల్లి ఏం కొండ; బంగారుకొండ - గానం: పి.సుశీల - రచన:ఆరుద్ర
- పోనీరా పోనీరా పోనీరా పోతే పోనీరా - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:ఆరుద్ర
- సరె సరె ఓరన్నా సరె సరె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం -రచన: ఆరుద్ర
- పల్లె మేలుకుందీ, రేపల్లె మేలుకుందీ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- నీవుంటే వేరే కనులేందుకు నీకంటే వేరే బ్రతుకేందుకు,(సంతొషం),- గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి.
- నీవుంటే వేరే కనులెందుకు నీకంటే (విషాదం),- గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: సి నారాయణ రెడ్డి.
మూలాలు
[మార్చు]- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
- ↑ బాపు, (సత్తిరాజు లక్ష్మీనారాయణ). "నేనూ - సంగీతం 1". గ్రేటాంధ్ర. Retrieved 28 July 2015.
3.ఘంటసాల గళామ్రుతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.