దొంగ కోళ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగ కోళ్లు
(1988 తెలుగు సినిమా)
Donga Kollu.jpg
దర్శకత్వం విజయబాపినీడు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
సుమలత,
బ్రహ్మానందం,
నూతన్ ప్రసాద్,
కైకాల సత్యనారాయణ
సంగీతం వాసూరావు
నిర్మాణ సంస్థ ఎ.ఆర్.సి. మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

ఇది 1988లో విడుదలైన తెలుగు సినీమా. విజయవంతమైన మలయాళ చిత్రం ఆధారంగా విజయబాపినీదు దర్శకత్వంలో నిర్మించబడింది. తరువాత హిందీలో "సరస్వతీ యే తేరా ఘర్" పేరుతో (సునీల్ షేట్టి) ప్రియదర్శన్ తీశారు.

చిత్రకథ[మార్చు]

రాజేంద్రప్రసాద్ పల్లెటూర్లో మధ్య తరగతికి చెందిన వ్యక్తి. ఇంటిని అనేక ఇబ్బందులు చుట్టిముట్టి ఉండటంతో పట్నంలో ఉన్న తమ ఇంటిని అమ్మి ఆ సొమ్ముతో సమస్యలు తీర్చుదామనుకుంటాడు. పట్నంలో ఉన్న ఇంటిలో సుమలత కుటుంబం అద్దెకుంటుంది. వారిదీ మధ్య తరగతే. వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటారు. అద్దె ఇంటిలో తిష్టవేసి వారికి ఇబ్బంది కలిగించి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూంటాడు. సుమలతలో నిజాయితీ వాళ్ళ కుటుంబ ఇబ్బందులు తెలియడంతో వారిని వదిలి వెళ్ళిపోతాడు, సుమలత అతడిని వెదికి పెళ్ళిచేసుకోవడంతో కథ సుఖాంతం రెండు వైపుల నుండి జరిగే ప్రయత్నాలతో హాస్య ప్రధానంగా కథ సాగుతుంది. పైకి హాస్య చిత్రంగా కనిపించినా కథామూలంలో కథానాయకుడికి, నాయికకు ఉన్న ఇబ్బందులు వల్ల వారి పాత్రల పట్ల సానుభూతి కలుగుతుంది. కొన్ని సంభాషణలు -'రెంట్ కంట్రోల్ యాక్టు నా చంకలో ఉంది', 'కాపీ టు పి యం, కాపీ టు సి.యమ్ కోడతాను' వంటివి జనరంజకమయ్యాయి.

ఇతర విశేషాలు[మార్చు]

  • సినిమా ఎక్కువ భాగం నాలుగు పోర్షన్లు కల ఒకే ఇంటీలో తీయడం
  • సదా కథానయకుడి చంకలో ఉండే గొడుగు, పైల్

సినిమా సన్నివేశాలు[మార్చు]

సినిమా సన్నివేశాలు[మార్చు]