వంకాయల సత్యనారాయణమూర్తి
వంకాయల సత్యనారాయణ | |
|---|---|
| జననం | వంకాయల సత్యనారాయణమూర్తి 1940 డిసెంబరు 28 విశాఖపట్నం, చవల వారి వీధి |
| మరణం | 2018 మార్చి 12 (వయసు: 77) |
| ఇతర పేర్లు | వంకాయల |
| ఎత్తు | 5"7 |
| పిల్లలు | ఇద్దరు కుమార్తెలు |
| తల్లిదండ్రులు |
|
వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.
ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.
సినిమాల జాబితా
[మార్చు]ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- అయినవాళ్ళు (1976)
- అర్ధాంగి (1977)
- సీతామాలక్ష్మి (1978)
- కమలమ్మ కమతం (1979)
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
- మా ఊళ్ళో మహాశివుడు (1979)
- రతీమన్మథ (1979)
- ఊరికిచ్చిన మాట (1981)
- కోరుకున్న మొగుడు (1981)
- శుభలేఖ (1982)
- శివుడు శివుడు శివుడు (1983)
- నవమోహిని (1984)
- మంత్ర దండం (1985)
- విజేత (1985)
- ఊరేగింపు (1988)
- జానకిరాముడు (1988)
- మహారాజశ్రీ మాయగాడు (1988)
- సూత్రధారులు (1990)
- అత్తింట్లో అద్దెమొగుడు (1991)
- ఆశయం (1993)
- రుక్మిణి (1997)
- కారందోశ (2016)[3]
ఇతర విశేషాలు
[మార్చు]- 1958లో కొచ్చిన్‌లో ఎన్సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఉత్తమ జూనియర్ క్యాడెట్‌గా నిలిచారు.
- 1958లో కొచ్చిన్‌లో ఎన్సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్ బోట్ రోయర్ బహుమతిని గెలుచుకున్నారు.
- 1960లో ఢిల్లీ రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు.
- 1960 ఆగస్టులో షూటింగ్ కాంపిటీషన్లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
- బి.కాంలో బంగారు పతకం అందుకున్నారు.
- జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[4]
మరణం
[మార్చు]కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[5][6]
వనరులు
[మార్చు]- ↑ "వంకాయల సత్యనారాయణమూర్తి కన్నుమూత". eenadu.net. 13 March 2018. the original నుండి 13 March 2018 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (14 March 2018). "వంకపెట్టలేని క్యారెక్టర్ నటుడు". గంగాధర్ వీర్ల. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (31 December 2016). "కారందోశ". ఒరిజినల్ నుండి 8 February 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 February 2020.
- ↑ "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. ఒరిజినల్ నుండి 2017-04-21 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-12-14.
- ↑ "నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి". సాక్షి (దినపత్రిక). 2018-03-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-03-12.
- ↑ నమస్తే తెలంగాణ (12 March 2018). "సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 March 2018.[permanent dead link]