వంకాయల సత్యనారాయణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వంకాయల సత్యనారాయణ
VankayalaSatyanarayana.PNG
జననంవంకాయల సత్యనారాయణమూర్తి
(1940-12-28) 1940 డిసెంబరు 28
విశాఖపట్నం, చవల వారి వీధి
మరణం2018 మార్చి 12 (2018-03-12)(వయసు 77)
భారతదేశం విశాఖపట్నం, భారతదేశం
ఇతర పేర్లువంకాయల
ఎత్తు5"7
పిల్లలుఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులు
  • వెంకటరామగుప్త (తండ్రి)
  • సుభద్రమ్మ (తల్లి)

వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.

ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.

సినిమాల జాబితా[మార్చు]

ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

ఇతర విశేషాలు[మార్చు]

  • 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
  • 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
  • 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే కవాతులో పాల్గొన్నారు.
  • 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
  • బి.కాంలో బంగారు పతకం అందుకున్నారు.

మరణం[మార్చు]

కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[4][5]

వనరులు[మార్చు]

  1. "వంకాయల సత్యనారాయణమూర్తి కన్నుమూత". eenadu.net. 13 March 2018. Archived from the original on 13 March 2018.
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (14 March 2018). "వంక‌పెట్ట‌లేని క్యా‌రెక్ట‌ర్ న‌టుడు". గంగాధర్‌ వీర్ల. Retrieved 17 March 2018.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (31 December 2016). "కారందోశ". Archived from the original on 8 ఫిబ్రవరి 2020. Retrieved 8 February 2020.
  4. "నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి". సాక్షి (దినపత్రిక). 2018-03-12. Retrieved 2018-03-12.
  5. నమస్తే తెలంగాణ (12 March 2018). "సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత". Retrieved 12 March 2018.[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]