జానకిరాముడు
Appearance
జానకిరాముడు (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. రాఘవేంద్ర రావు |
---|---|
నిర్మాణం | [[కాట్రగడ్డ మురారి]] |
తారాగణం | అక్కినేని నాగార్జున, విజయశాంతి, జీవిత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | యువచిత్ర ఆర్ట్స్ |
భాష | తెలుగు |
జానకిరాముడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో [[కాట్రగడ్డ మురారి]] నిర్మాతగా యువచిత్ర ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. అక్కినేని నాగార్జున, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
తారాగణం
[మార్చు]- రాము/రంగా గా అక్కినేని నాగార్జున
- జానకి/లక్ష్మి గా విజయశాంతి
- బలవంతరావు గా మోహన్ బాబు
- అబద్ధాల సత్యవతి గా జీవిత
- రాఘవయ్య గా జగ్గయ్య
- రాము తండ్రి గా కైకాల సత్యనారాయణ
- భూపతి గా ప్రదీప్ శక్తి
- కత్తుల నరసింహ భూపతి గా చలపతి రావు
- రంగం సింగరాజు గా బ్రహ్మానందం
- సత్యవతి తండ్రి గా సాక్షి రంగారావు
- హనుమంతు గా సుత్తివేలు
- డాక్టర్ గా భీమేశ్వర రావు
- పంతులు గా వంకాయల సత్యనారాయణ
- శంభో శివశంకర శాస్త్రి గా చిడతల అప్పారావు
- అన్నపూర్ణమ్మ గా శుభ
- దుర్గమ్మ గా కాకినాడ శ్యామల
- మంగళ గా చంద్రిక
- శ్రీలక్ష్మి
- కల్పనా రాయ్
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]నాగార్జున కథానాయకునిగా నిర్మాత [[కాట్రగడ్డ మురారి]] సినిమా తీద్దామని భావించి విజయేంద్ర ప్రసాద్తో కథ రాయించారు. తర్వాతికాలంలో పలు విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ కు కథారచయితగా ఇదే తొలి చిత్రం. మూగ మనసులు సినిమా ఇతివృత్తమే కావాలి కానీ కథనం, నేపథ్యం కొత్తగా ఉండాలని మురారి కోరుకోవడంతో అలాగే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో జానకి రాముడు సినిమా తీశారు.[1]
ప్రభావాలూ, థీమ్స్
[మార్చు]సినిమాను అభివృద్ధి దశలోనే మూగ మనసులు ఇతివృత్తం ఆధారంగానే తీద్దామని నిర్ణయించుకోవడంతో [1] ఇతివృత్తంపై మూగమనసుల ప్రభావం ఉంది.
పాటలు
[మార్చు]- నా గొంతు శృతిలోనా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ,రచన: ఆత్రేయ
- అరెరే పరుగెత్తి పోతోంది , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, రచన: సిరివెన్నెల.
- చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- నీ చరణం కమలం మృదులం , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , జానకి, రచన: వేటూరి.
- అదిరింది మామా అదిరిందిరో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,సుశీల, రచన: ఆత్రేయ .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 సాక్షి, బృందం (8 December 2015). "కథానాయకుడు". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Retrieved 7 February 2016.