కల్పనా రాయ్
కల్పనా రాయ్ | |
---|---|
జననం | కల్పన 1950 మే 9 |
మరణం | 2008 ఫిబ్రవరి 6 | (వయసు 57)
గుర్తించదగిన సేవలు | కలిసుందాం రా ఆపద్బాంధవుడు శీను |
జీవిత భాగస్వామి | మోహన్ రాయ్ |
కల్పనా రాయ్ (మే 9, 1950 - ఫిబ్రవరి 6, 2008) ప్రముఖ తెలుగు హాస్యనటి. ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. దాదాపు 430 తెలుగు చిత్రాలలో నటించింది.[1] కాకినాడలో జన్మించింది.
జీవిత విశేషాలు
[మార్చు]కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి. ఈమె కాకినాడ లో జన్మించింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు కల్పన గా మార్చుకుంది. మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళిచేసుకుని కల్పనా రాయ్ గా మారింది. వీరికి ఒక కుమార్తె. నటి శారద అంటే ఈమెకు అభిమానం ఆమె సలహా మేరకే సినిమాల్లోకి వచ్చింది.
దర్శకుడు కోడి రామకృష్ణ, నటుడు వెంకటేష్ ఈమెకు ఎక్కువగా అవకాశాలు కల్పించారు.[2] ఆమె కుమార్తె తల్లికి ఇష్టం లేని పెళ్ళి చేసుకుని ఆమెకు దూరమైంది. చివరి దశలో మధుమేహ వ్యాధి బారిన పడి, చూసుకోవడానికి ఎవరూ లేక ఆరోగ్యం క్షీణించింది. కల్పనా రాయ్ హైదరాబాదు, ఇందిరానగర్ లో తన నివాసంలో సహజ మరణం పొందింది. సినిమాల్లోకి రాక ముందునుంచీ ఈమెకు దానగుణం ఎక్కువ. 400 సినిమాల్లో నటించినా ఆమెకు చివరి రోజుల్లో ఏమీ దాచుకోలేదు. తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె అంత్యక్రియల కోసం పది వేల రూపాయలు కేటాయించింది. ఆమె చివరి చూపులకు కూడా ఎవరూ పెద్దగా హాజరు కాలేదు.[3]
నటించిన చిత్రాలు
[మార్చు]- మధుమాసం (2007)
- పుట్టింటికి రా చెల్లి (2004)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం (2001)
- ప్రియమైన నీకు (2001)
- బాచి (2000)
- కలిసుందాం రా (2000)
- పాపే నా ప్రాణం (2000)
- పెళ్ళి సంబంధం (2000)
- శీను (1999)
- యువరత్న రాణా (1998)
- ప్రేమించుకుందాం రా (1997)
- గోల్మాల్ గోవిందం (1992)
- ఆపద్బాంధవుడు (1992)
- మంత్రదండం
- జానకి రాముడు (1988)
- ఆఖరిపోరాటం (1988)
- శాంతినివాసం (1986)
- కెప్టెన్ నాగార్జున (1986)
- కారు దిద్దిన కాపురం (1986)
- శ్రీమతి కావాలి (1984)
- ఆడవాళ్ళు అలిగితే (1983)
- రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
- శ్రీనివాస కల్యాణం
మూలాలు
[మార్చు]- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/36407.html
- ↑ Telugu, Sumantv (2022-11-08). "ప్రేక్షకులను నవ్వించిన కల్పనా రాయ్.. జీవితంలో ఎన్ని కష్టాలో! చితికి కూడా డబ్బులు లేక!". sumantv.com. Archived from the original on 2023-05-09. Retrieved 2023-05-09.
- ↑ "Comedian And Senior Actress Kalpana Rai Struggles And Tragic Life Story In Telugu - Sakshi". www.sakshi.com. Retrieved 2024-05-06.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కల్పనా రాయ్ పేజీ