ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
రచన | పూరీ జగన్నాధ్ (కథ) పూరీ జగన్నాధ్ (screenplay) పూరీ జగన్నాధ్ (సంభాషణలు) |
నిర్మాత | కె. వేణుగోపాల రెడ్డి |
తారాగణం | రవితేజ (నటుడు) తనూరాయ్ సమ్రిన్ |
ఛాయాగ్రహణం | దత్తు. కె |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 14 సెప్టెంబర్ 2001 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా.[1][2] సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయంతో పూరీతో బాటు కథానాయకుడు రవితేజ, నాయిక తనూ రాయ్, సంగీత దర్శకుడు చక్రికి సినీ రంగంలో నిలదొక్కుకునే అవకాశం దొరికింది.
కథ
[మార్చు]నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]పవన్ కళ్యాణ్ కథానాయకునిగా తన మొదటి సినిమా బద్రి సినిమా తీశాకా పూరీ జగన్నాథ్ దర్శకునిగా తీసిన సినిమా ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మాత్రం పూరీ ఏనాడో తయారుచేసుకుని పెట్టుకున్నారు. బద్రి సినిమా కథ పవన్ కళ్యాణ్ కి వినిపించేందుకు అవకాశం కోసం ముందుగా కథని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడుకి వినిపించాల్సివచ్చింది. అయితే బద్రి కథ ఇద్దరు హీరోయిన్లు, వారితో ప్రేమ పేరుతో పందెం వంటి రిస్కీ అంశాలతో ఉండడంతో ఛోటాకు నచ్చకుంటే పవన్ కళ్యాణ్ కి కథ చెప్పే అవకాశమే పోతుందన్న భయం పట్టుకుంది పూరీ జగన్నాథ్ కి. దాంతో సేఫ్ బెట్ అన్న ఉద్దేశంతో ఈ కథని వినిపించారు. అయితే ఛోటాకి ఈ కథ చాలా నచ్చేయడంతో పవన్ కి చెప్పే వీలుదొరికింది, కానీ పూరీ పవన్ కి మాత్రం బద్రి కథనే చెప్పి ఓకే చేయించుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించాకా ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు పూరీ.[3]
తారాగణం
[మార్చు]- రవితేజ
- తనూ రాజ్
- సమ్రిన్
- అనంత్
- అన్నపూర్ణ
- తనికెళ్ళ భరణి
- చిన్నా
- జీవా
- రఘు కుంచే
- ఎల్. బి. శ్రీరామ్
- ఎం. ఎస్. నారాయణ
- ప్రసన్న
- కల్పనా రాయ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఉత్తేజ్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ - పూరీ జగన్నాధ్
- స్క్రీన్ ప్లే - పూరీ జగన్నాధ్
- దర్శకత్వం - పూరీ జగన్నాధ్
- సంగీతం - చక్రి
సంగీతం
[మార్చు]చక్రి స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని కౌసల్య ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది.
హ్యాపీ డే, రచన: చంద్రబోస్, గానం. చక్రి
మల్లి కూయవే గువ్వా , రచన: కందికొండ , గానం.హరీహరన్ , కౌసల్య
నీకోసం , రచన: కందికొండ, గానం.సుధ
రామ చక్కని , రచన: భాస్కర భట్ల రవికుమార్.గానం.సుక్విందర్ సింగ్ , సావేరి
ఏమో ఏమవునో , రచన: సాహితీ, గానం.చక్రి
పిల్లో పిసినారి పిల్లో, రచన: సాహితి, గానం.కుమార్ సాను , కౌసల్య.
మూలాలు
[మార్చు]- ↑ http://www.idlebrain.com/movie/archive/mr-iss.html
- ↑ http://entertainment.oneindia.in/telugu/movies/itlu-sravani-subramanyam/cast-crew.html[permanent dead link]
- ↑ రిపోర్టర్. "బద్రి వెనుక స్టోరీ". గ్రేటాంధ్ర. Retrieved 12 August 2015.