తనూరాయ్
స్వరూపం
తనూరాయ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2001 - ప్రస్తుతం |
తనూరాయ్ భారతీయ సినిమా నటి, ప్రచారకర్త. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తనూరాయ్ తమిళ, మళయాల, కన్నడ, బెంగాళీ చిత్రాలలో నటించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]తనూరాయ్ 1980, డిసెంబర్ 26న కలకత్తా లో జన్మించింది.[1] 2వ సంవత్సరం కళాశాల చదువును మధ్యలోనే మానేసి, ముంబై వెళ్లి ఫిల్మ్ యాక్టింగ్ లో శిక్షణ పొందింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]తనూరాయ్ 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో తొలిసారిగా నటించింది.[2] అటుతరువాత ఆనందం, మనసంతా నువ్వే వంటి చిత్రాలలో నటించింది.[3]
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2001 | ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం | శ్రావణి | తెలుగు | |
ఆనందం | దీపిక | తెలుగు | ||
మనసంతా నువ్వే | శృతి | తెలుగు | ||
2003 | ఇంద్రు | జెన్నిఫర్ | తమిళం | |
సత్యం | తెలుగు | అతిథి పాత్ర | ||
మోనేర్ మహ్జే తుమి | బెంగాళీ | |||
2004 | అవును నిజమే | రుచిత | తెలుగు | |
మేఘం | తెలుగు | |||
నో | తెలుగు | అతిథి పాత్ర | ||
మాస్ | తెలుగు | అతిథి పాత్ర | ||
పెళ్ళికానీ పెళ్ళాం అవుతుంది | తెలుగు | |||
2005 | కీలుగుర్రం | తెలుగు | ||
ప్రయత్నం | తెలుగు | |||
గిరివలం | ప్రియా | తమిళం | ||
ఉయిర్ ఉల్లవరై | తమిళం | |||
మేఘమాల - ఓ పెళ్ళాం గోల | మేఘమాల | తెలుగు | ||
నమ్మన్న | కన్నడ | అతిథి పాత్ర | ||
లవ్ స్టోరి | స్వప్న | కన్నడ | ||
2007 | ఆఖరి పేజి | తెలుగు | ||
వియ్యాలవారి కయ్యాలు | తెలుగు | అతిథి పాత్ర | ||
రుద్రమణి | తెలుగు | |||
2008 | పెళ్ళి కాని ప్రసాద్ | తెలుగు | అతిథి పాత్ర | |
హీరో | తెలుగు | అతిథి పాత్ర | ||
2011 | కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు | సరళ | తెలుగు | అతిథి పాత్ర |
2012 | ఈ ఆడుతా కాలతు | మధురి కురియన్ | మళయాలం | |
అలా జరిగింది ఒకరోజు | తెలుగు | |||
2013 | ఒరిస్సా | మీరాబాయ్ | మళయాలం | |
డి కంపనీ | జరీనా మహ్మద్ | మళయాలం | ||
ప్రివ్యూ | మళయాలం | |||
ఓ మంజుల కథ | మంజుల | తెలుగు | ||
బాల్యకాలసఖి | మళయాలం | |||
2016 | జెమిని | మళయాలం | పోస్ట్ ప్రొడక్షన్ | |
ప్రచాయి | రాధిక నాయర్ | మళయాలం | చిత్రీకరణ |
మూలాలు
[మార్చు]- ↑ ది హిందూ. "Lovely 'chechi'". Retrieved 4 May 2017.
- ↑ సాక్షి, ఫన్ డేకథ,. "మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!". Retrieved 4 May 2017.
{{cite news}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ ఐడెల్ బ్రెయిన్. "Tanu Roy feels cheated". www.idlebrain.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 4 May 2017.