సత్యం (సినిమా)
సత్యం | |
---|---|
దర్శకత్వం | సూర్యకిరణ్ |
రచన | సూర్యకిరణ్ బి. వి. ఎస్. రవి |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
తారాగణం | సుమంత్ జెనీలియా డిసౌజా కోట శ్రీనివాసరావు |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | చక్రి |
పంపిణీదార్లు | అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల తేదీ | 19 డిసెంబరు 2003 |
సినిమా నిడివి | 144 నిమిషాలు |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹ 3.5 కోట్లు |
సత్యం 2003 లో సూర్యకిరణ్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[1] ఇందులో సుమంత్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించారు.[2] ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది, బాక్సాఫీస్ వద్ద చాలా విజయవంతమైంది. సుమంత్ కెరీర్లో అతిపెద్ద బాక్సాఫీస్ విజయాలలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం తెలుగులో జెనీలియాకు తొలి చిత్రం. చక్రి ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇది బెంగాలీలో శక్తి పేరుతో రీమేక్ చేయబడింది.
కథ
[మార్చు]సత్యం (సుమంత్) సినిమాల్లో గేయరచయితగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన జీవితంలో ఎంతో ముఖ్యంగా భావించే తండ్రి (మల్లాది రాఘవ), తన స్నేహితురాలు అంకిత (జెనీలియా డిసౌజా) దగ్గర చెడ్డవాడిగా ముద్రపడతాడు. తండ్రికి తనకు పడకపోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసి స్నేహితులతో కలిసి నివసిస్తుంటాడు. సున్నితమైన మనస్కుడైనా సత్యం ఓ పాపులర్ రచయిత దగ్గర ఘోస్టు రచయితగా పనిచేస్తుంటాడు. తాను రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే తన ప్రియురాలు అంకితకు తన ప్రేమను తెలియబరచాలనుకుంటాడు. ఈ లోపునే అంకిత క్లాస్ మేట్ ఒకరు ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తర్వాత అంకిత తండ్రి (కోట శ్రీనివాసరావు) సత్యం కి పరిచయమై అతన్ని అభిమానిస్తుంటాడు. చివరికి సత్యం, అంకిత కలుసుకున్నారా లేదా అన్నది మిగతా కథ.
తారాగణం
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓ మగువా నీతో స్నేహం కోసం" | భాస్కరభట్ల | చక్రి | 5:57 |
2. | "కుచ్ కుచ్" | విశ్వ | విశ్వ, కౌసల్య | 5:24 |
3. | "రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్" | రాజేష్, వెంకట రమణ | వెంకట రమణ, సూర్య కిరణ్ | 2:46 |
4. | "మధురమే మధురమే" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | వేణు | 4:38 |
5. | "ఐ ఆం ఇన్ లవ్" | కందికొండ | వేణు | 5:39 |
6. | "పిలిచిన పలకదు ప్రేమా" | కందికొండ | రవి వర్మ, చక్రి | 5:18 |
7. | "ఓరి దేవుడా" | కందికొండ | వాసు, సూర్యకిరణ్ | 5:18 |
మొత్తం నిడివి: | 26:35 |
మూలాలు
[మార్చు]- ↑ జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో సత్యం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 20 November 2016.
- ↑ "16 వసంతాల 'సత్యం'". సితార. Archived from the original on 2020-07-18. Retrieved 2020-07-14.