కౌసల్య (గాయని)
కౌసల్య | |
---|---|
జననం | ఆగస్టు 8 |
మూలం | గుంటూరు |
వృత్తి | గాయని, సంగీత దర్శకురాలు , డబ్బింగ్ కళాకారిణి |
క్రియాశీల కాలం | 1999–ఇప్పటి వరకు |
కౌసల్య తెలుగు సినీ నేపథ్యగాయని. సొంత ఊరు గుంటూరు. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందింది.[1] ఆ తరువాత పద్మావతి విశ్వవిద్యాలయంలోశాస్త్రీయ సంగీతంలో పీజీ చేసింది. చిన్ననాటి స్నేహితుడు వృత్తిరీత్యా ఇంజనీరు అయిన బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్‌లో ప్రేమించి పెళ్లిచేసుకుంది. వారికి ఒక అబ్బాయి. ఆమె పాడిన పాటల్లో రా..రమ్మని రారా రమ్మని, లంచ్‌కొస్తావా.. మంచుకొస్తావా ,వల్లంకి పిట్టా.. వల్లంకి పిట్టా.. లాంటి 300 పాటలు పాడారు. పాడుతా తీయగా ఫైనల్‌లో ఓడిపోయింది. తొలి అవకాశం నీకోసం సినిమాలో వచ్చింది. సత్యభామలో 'గుండెలోన' అనే పాటకు నంది అవార్డు వచ్చింది.
సినిమాలు
[మార్చు]- 2004 - ఆంధ్రావాలా
- 2004 - ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు: (నీ వయసు తక్కువ, గోవిందా గోవిందా)
కౌసల్య ఆలపించిన కొన్ని సూపర్ హిట్ పాటలు
[మార్చు]పాట | చిత్రం | సంగీతం | పాడిన వారు |
---|---|---|---|
మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా | ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | చక్రి | హరిహరన్, కౌసల్య |
భర్తపై వేధింపుల కేసు
[మార్చు]తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య 2015 నవంబరు 24న సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో కౌసల్య భర్తను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ చేసారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ తెలుగులో.కామ్‌లో కౌసల్య ఇంటర్వ్యూ
- ↑ "నా భర్త వేధిస్తున్నాడు: గాయని కౌసల్య". సాక్షి (దినపత్రిక). 2015-11-24. Retrieved 2015-11-24.